న్యూ ఇయర్ లో సరదాగా గడిపేందుకు... కపుల్స్ కి బెస్ట్ ఐడియాస్...!
సరదాగా బైక్ రైడ్ లేదంటే... కారు డ్రైవ్ కి వెళ్లాలి. అన్ని ప్లేసెస్ చూస్తూ.. స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేయడం లాంటివి చేయాలి.

న్యూ ఇయర్ రోజున సరదాగా గడిపాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే... చాలా మంది సరదాగా గడపడం అంటే... ఇంట్లో కూర్చొని టీవీ చూడటం, వెబ్ సరీస్ చూడటం అనుకుంటారు. కానీ... అంతకు మించి ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చు. కపుల్స్.. ఎలా న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయవచ్చో ఓసారి చూద్దాం..
1.ఈ రోజుల్లో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అందరికీ చాలా కామన్ విషయం. ఈ రీల్స్ లో కపుల్ డ్యాన్స్ కూడా ఉండే ఉంటాయి. కాబట్టి.. సరదాగా మీరు కూడా ఆ డ్యాన్స్ ట్రై చేసి.. వీడియోలు తీసుకోండి. సరదాగా ఉంటుంది.
2.ఊరికే ఇంట్లోనే కూర్చోవడం కాకుండా... సరదాగా బైక్ రైడ్ లేదంటే... కారు డ్రైవ్ కి వెళ్లాలి. అన్ని ప్లేసెస్ చూస్తూ.. స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేయడం లాంటివి చేయాలి.
3. ఇంట్లో ఉన్న ఆ స్పెషల్ రోజున బయటి ఫుడ్ ఆర్డర్ చేసుకోకుండా... ఇద్దరూ కలిసి వంట చేసుకోవాలి. వంట రాకపోతే.. యూట్యూబ్ చూసి ట్రై చేస్తే సరిపోతుంది. సరదాగా కూడా ఉంటుంది.
4.కేవలం న్యూ ఇయర్ రోజున మాత్రమేకాదు..ఇంట్లో ఖాళీగా ఉన్న రోజు దంపతులు... ఇళ్లు శుభ్రం చేసుకోవడం లాంటివి కలిసి చేసుకోవాలి.
5.దంపతులు ఇద్దరూ కలిసి ఇంటిని అలంకరించుకోవడం, ఇంటి అలంకరణంగా స్వయంగా వస్తువులు తయారు చేసుకోవడం.. ఎవరి ఆసక్తిని బట్టి వారు చేసుకోవాలి. ఇది కూడా సరదాగా ఉంటుంది.
6.దంపతులు ఇద్దరూ కలిసి సరదాగా పోటీ పెట్టుకొని గోల్ గప్పాలు తినడం లాంటివి చేయాలి. అంతేకాకుండా.. ఊరికే కూర్చొని టైమ్ వేస్ట్ చేసుకునే బదులు... పాత గ్నాపకాలు నెమరువేసుకోవాలి.
7.ఇద్దరూ కలిసి సరదాగా మ్యూజిక్ కన్సర్ట్స్ కి వెళ్లడం లేదంటే.... వర్చువల్ గా మ్యూజికల్ కన్సర్ట్స్ చూడటం లాంటివి చూడాలి. ఇంట్లోనే హోం మేడ్ పాప్ కార్న్ చేసుకొని తినడం లాంటివి చేయాలి.
8.దంపతులు ఇద్దరూ కలిసి సరదాగా ఏదైనా ప్లేస్ కి పిక్నిక్ కి వెళ్లడం లాంటివి చేయాలి. అక్కడే స్నాక్స్ లాంటివి తినడం మంచిది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు.. సన్ స్క్రీన్ లోషన్ తీసుకువెళ్లడం మర్చిపోవద్దు.
9.కేవలం న్యూ ఇయర్ రోజున మాత్రమే కాదు.... ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇద్దరూ కలిసి వర్కౌట్స్ చేయడం, వాకింగ్ కి వెళ్లడం, యోగా చేయడం లాంటివి చేయాలి.