MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship tips: ఈ అలవాట్లే బ్రేకప్ కు దారితీస్తాయి.. జాగ్రత్త..

Relationship tips: ఈ అలవాట్లే బ్రేకప్ కు దారితీస్తాయి.. జాగ్రత్త..

relationship tips: ప్రేమ ఒక అందమైన భావన. ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడానికి ఎంత ఎక్కువ సమయం పడుతుందో.. అది బ్రేకప్ కావడానికి అంత కంటే తక్కువ సమయమే పడుతుంది. ముఖ్యంగా కొన్ని అలవాట్ల వల్ల మంచిగా ఉండే జంట కూడా బ్రేకప్ చెప్పుకునే పరిస్థితికి దారితీస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2022, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


relationship tips: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. ఇక ఆ సమయంలో ప్రేమికుల ఆనందానికి అవదులు ఉండవేమో. ప్రేమ నమ్మకంతోనే ముందుకు నడుస్తోంది. ఏ బంధంలోనైనా.. నమ్మకం, ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉండాలి. వారి తప్పులను కూడా స్వీకరించే గుణముండాలి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కానీ ఈ రోజుల్లో ఏ బంధాలు చాలా కాలం కొనసాగడం లేదు. తక్కువ సమయంలోనే బ్రేకప్ అవుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్నిచెడు అలవాట్లే కారణం. ఒక వేళ మీ భాగస్వామికి ఈ చెడు అలవాట్లుంటే.. మీ లవ్ బలహీనపడటం మొదలవుతుంది. ఇంతకీ అవి ఎలాంటి అలవాట్లో తెలుసుకుందాం పదండి. 

37

భాగస్వామిని కంట్రోల్ లో ఉంచడం.. మీ రిలేషన్ షిప్ లో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. అంతేకానీ మీ భాగస్వామిని మీ చెప్ప చేతల్లో ఉంచుకుని..  మీరు చెప్పినట్టే చేయాలి, వినాలి లాంటి నిబంధనలను పెట్టకూడదు. ఈ  అలవాటు వల్ల మీ రిలేషన్ షిప్ బలహీనపడటం ప్రారంభమవుతుంది. కొంతమందైతే తమ భాగస్వామి ఏ దుస్తులు వేసుకోవాలి, ఏవి వేసుకోకూడదు, ఎవరితో ఎంత సమయం గడపాలి వంటి ప్రతి విషయంలో వారిని నియంత్రిస్తుంటారు. ఇలా చేస్తే మీ భాగస్వామికి మీపై ఉన్న ఇష్టం కాస్త.. అసహ్యంగా మారి బ్రేకప్ కు దారి తీస్తుంది. 
 

47

ఒకరిపై ఆధారపడటం.. రిలేషన్ షిప్ అన్నాక అన్నీ పంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు ఏ పని చేయకుండా పూర్తిగా మీ భాగస్వామిపై ఆధారపడితే మాత్రం వారికి మీరు చులకన అవుతారు. వారు లేకుండా మీరు బతకలేరు అనే ఆలోచన వారికి కలుగుతుంది. అంతేకాదు ఈ విషయాన్ని పదేపదే మీకు గుర్తుచేస్తారు. ఇది మీరు విడిపోవడానికి కారణమవుతుంది. 
 

57

నిఘా ఉంచడం.. భాగస్వామి పట్ల బాధ్యతగా ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ వారు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు.. ఎంత సేపు గడుపుతున్నారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారు వంటి వాటిపై కన్నేసి ఉంచడం చెడ్డ అలవాటు. ఇది మీ ప్రేమ బంధాన్ని నాశనం చేస్తుంది.  

67

హింస.. శారీరకంగా, మానసికంగా పెట్టే హింసలు ఏ బంధాన్నైనా ఇట్టే విడగొడతాయి. ఇది చెడ్డ అలవాటు కూడా. మీ భాగస్వామిని మానసికంగా హింసించడం లేదా శారీరకంగా బాధపెట్టడం వల్ల మీ బంధం చాలా తర్వగా ముగిసిపోతుంది. 

77

పదేపదే బెదిరించడం.. కొంతమంది తమ భాగస్వామిని చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడి.. విడిపోతా చూడు అంటూ బెదిరిస్తూ ఉంటారు. ఇదే  మీ బంధాన్ని బలహీనం చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడకండి. ఇది ప్రేమ బంధాన్ని విడగొడుతుంది.      

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Handbag Designs: మినీ హ్యాండ్‌ బ్యాగ్స్.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Recommended image2
Silver Nose Pin: ఈ వెండి ముక్కుపుడకలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Kitchen Cabinets: ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved