బెల్లీ ఫ్యాట్ ఉంటే ఎన్నో రోగాలొస్తయ్.. కరగాలంటే ఈ పండ్లను తినండి..
కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోవాలి. అలాగే నూనెలో వేయించిన ఆహారాలను అసలే తినకూడదు. అలాగే మీరు తినే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతే ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పొత్తి కడుపు కొవ్వు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులతో పాటుగా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాయామం లేకపోవడం, విచ్చలవిడిగా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా పెరుగుతుంది. ఏదేమైనా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం అంత సులువు కాదు. బెల్లీ ఫ్యాట్ కరగడానికి సరైన ఆహారం, రోజువారీ వ్యాయామాలు చాలా చాలా అవసరం.
belly fat
బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే నూనెలో వేయించిన ఆహారాలను అసలే తినకూడదు. అలాగే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అలాగే మీరు తినే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. అయితే కొన్ని రకాల పండ్లు తింటే బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గుతుంది.
అవకాడో
అవొకాడోలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి మీరు సులువుగా బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. వీటిలో పొటాషియం, ఫోలేట్ లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
కివి
కివీల్లో విటమిన్ బి, విటమిన్ సి, రాగి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే కివి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇవి మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతాయి.
berries
బెర్రీలు
బెర్రీల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీలు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా బ్లూబెర్రీలను తింటే కొవ్వు సులువుగా కరిగిపోతుంది.
apples
యాపిల్స్
యాపిల్స్ కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి, బరువును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే మీరు ఎక్కువగా తినకుండా ఉంటారు. ఈ విధంగా మీరు బరువు తగ్గడానికి యాపిల్స్ సహాయపడతాయి. పెక్టిన్ అధికంగా ఉండే ఆపిల్ శరీరలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
జామకాయ
జామకాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో కూడా పెక్టిన్ ఉంటుంది. పెక్టిన్ కణాలు కొవ్వును గ్రహించకుండా నిరోధిస్తుంది. బరువు నియంత్రణలో ఉండాలన్నా.. బెల్లీ ఫ్యాట్ కరగాలన్నా.. జామకాయను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి.
పుచ్చకాయ
పుచ్చకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పుచ్చకాయలలో నీరు ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలంటే భోజనానికి ముందు పుచ్చకాయను తినండి. ఇది అదనపు కేలరీలు మీ శరీరంలో చేరకుండా మీ కడుపును నింపుతుంది. ఎక్కువగా తినాలన్న కోరికను తగ్గిస్తుంది.