Periods Pain: పీరియడ్స్ నొప్పి వెంటనే తగ్గాలంటే వీటిని తినండి..
Periods Pain: పీరియడ్స్ టైం లో వచ్చ పొత్తికడుపు నొప్పిని తగ్గించేందుకు కొన్నిరకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ఈ ఆహారాలు తినడం వల్ల రుతుస్రావంలో వచ్చే ఆటంకాల నుంచి ఉపశమనం లభిస్తుంది..

రుతుస్రావం అనేది ప్రతి మహిళా ఎదుర్కొనే సర్వ సాధారణ విషయం. ఇక ఈ సమయంలో కొంతమంది ఆడవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. దాన్ని తట్టుకోలేక చాలా మంది పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కాస్త ఉపశమనం కలిగినా.. ఆరోగ్యానికి మాత్రం మంచివి కావు. పెయిన్ కిల్లర్ ట్యాట్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఈ నొప్పిని సహజ మార్గాల్లోనే తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
periods
నెలసరి నొప్పిని తగ్గించేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ ఫుడ్స్ .. పీరియడ్స్ సమయంలో కలిగే ఇతర సమస్యలను సైతం పోగొడుతాయి. ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ ను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు (Water)
నెలసరి నొప్పిని తగ్గించే చిట్కాల్లో నీళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. ఎందుకంటే నీళ్లు సర్వరోగ నివారిణీగా పనిచేస్తాయి కాబట్టి. కానీ చాలా మంది నెలసరి సమయంలో నీళ్లను అస్సలు తాగరు. నిజానికి ఆ సమయంలో నీళ్లను పుష్కలంగా తాగితే రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నీటితో పాటు కొబ్బరినీళ్లు, కూరగాయల రసాలు, మజ్జిగ వంటివి తీసుకున్నా నొప్పి తగ్గిపోతుంది.
పెరుగు (Yogurt)
పెరుగు తీసుకోవడం వల్ల బహిష్టు నొప్పి (Menstrual pain)ని తగ్గింవచ్చు. పెరుగు కాల్షియం, ప్రొటీన్లకు మంచి మూలం. ఇది కండరాలను సడలించడానికి , రుతుక్రమానికి ముందు అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు పెరుగు లేదా జ్యూస్ , స్మూతీని కూడా తీసుకోవచ్చు.
గింజలు (Nuts)
బహిష్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గింజలు (Nuts), విత్తనాలు (Seeds) ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇతర అనారోగ్యకరమైన ఆహారాలను తినకుండా మనల్ని నిరోధిస్తాయి. ఇది కడుపును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
అరటిపండ్లు (Bananas)
అరటిపండ్లు (Bananas)తినడం వల్ల కూడా రుతుస్రావం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రుతుస్రావంతో ముడిపడి ఉన్న 'మూడ్ స్వింగ్స్'ను సరిచేయడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.
చిక్కుళ్లు (Legumes)
చిక్కుళ్ళు పెద్ద మొత్తంలో తీసుకోవడం కూడా రుతుక్రమ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. చిక్కుళ్ళలో ఇనుము, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తం సజావుగా ప్రవహించడానికి సహాయపడుతుంది. చిక్కుళ్లలో ఉండే జింక్ కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.