- Home
- Life
- Belly Fat Loss Tips: బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా? అయితే ఇవి తినండి.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
Belly Fat Loss Tips: బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా? అయితే ఇవి తినండి.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
Belly Fat Loss Tips: దాల్చిన చెక్క, ఆపిల్ పండ్లు, బాదంప పప్పు, క్వినోవా తో బెల్లీ ఫ్యాట్ ను సులభంగా కరిగించొచ్చు.

belly fat
Belly Fat Loss Tips: తీరిక లేని జీవిన విధానం, చెడు ఆహారపు అలవాట్ల మూలంగా నేడు ఎంతో మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఒంట్లో కొవ్వులు పెరుగుతుంటాయి. దీంతో పొట్ట, తొడల వద్ద విపరీతంగా కొవ్వు పేరుకుపోతుంది. ఇంకేముంది దీంతో శరీరాకృతి మొత్తం దెబ్బతింటుంది.
ఆడైనా.. మగైనా.. కొన్ని వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తే సులభంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. కానీ తొడలు, పొట్ట భాగంలో మాత్రం కొవ్వును అంత తొందరగా కరిగించలేం. కొన్ని వ్యాయామాలతో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను సులభంగా కరిగించొచ్చు. అవేంటంటే.
బాదం పప్పులు.. బాదం పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులను రోజుకు నాలుగైదు తింటే మీకు ఆకలి అంత తొందరగా అవదు. అంతేకాదు వీటిని తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.
ఆపిల్.. వైద్యుడి అవసరం పడకూడదంటే.. రోజుకో ఆపిల్ పండును తినాలని మన పెద్దలు చెప్తుంటారు. అవును మరి రోజుకు ఒక్క ఆపిల్ పండు తింటే ఎలాంటి రోగాలు రావట. అంతేకాదు ఆపిల్ పండును తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఒక్క ఆపిల్ పండులో ఫైబర్ నాలుగైదు గ్రాములు ఉంటుంది. దీనివల్ల మీ కడుపు చాలా సమయం వరకు నిండుగానే ఉన్న భావన కలుగుతుంది.
దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల కూడా మీరు సులభంగా బరువు కోల్పోవచ్చు ఇందుకోసం మీరు రోజు తాగే టీలో షుగర్ కు బదులుగా దాల్చిన చెక్కను వేయండి. ఈ టీని తాగడం వల్ల ఇన్సులిన్ నియంత్రించబడుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు.
గుడ్డులోని తెల్లసొన.. కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిని ప్రతిరోజూ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే గుడ్డులోని తెల్లసొనను తింటే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మీకు అంత తొందరగా ఆకలి కాదు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డులోని తెల్లసొనను తినండి.
క్వినోవా.. ఊబకాయం నుంచి తొందరగా బయటపడేందుకు క్వినోవా చక్కటి డైట్ అనే చెప్పాలి. క్వినోవాను నిత్యం తీసుకోవడం వల్ల మీ బాడీకి అవసరమయ్యే శక్తి కూడా అందుతుంది. కాబట్టి అన్నానికి బదులుగా దీన్నే తినండి. సులభంగా బరువు తగ్గుతారు.