- Home
- Life
- Beauty Tips: వంటింట్లో ఉండే ఈ ఐదింటిని ముఖానికి ఎట్టి పరిస్థితిలో పెట్టకండి.. పొరపాటున పెట్టారో..?
Beauty Tips: వంటింట్లో ఉండే ఈ ఐదింటిని ముఖానికి ఎట్టి పరిస్థితిలో పెట్టకండి.. పొరపాటున పెట్టారో..?
Beauty Tips: దాల్చిన చెక్క పౌడర్, నిమ్మరసం, వెజిటేబుల్ నూనెలు, బేకింగ్ సోడాను ఎట్టి పరిస్థితిలో మీ ముఖానికి అప్లై చేయకండి. ఎందుకంటే..

Beauty Tips: ముఖం అందంగా మెరిసిపోవాలని, పండ్లను, పండ్ల రసాలను, పసుపు, పెరుగుతో పాటుగా కొన్ని రకాల కూరగాయలను కూడా ముఖానికి పెడుతుంటారు. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి వీటిని ఎవ్వరైనా పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీటివల్ల అందం పెరగడమే తప్ప తగ్గదనే నమ్మకం వల్ల చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే వంటింట్లో ఉండే కొన్నింటిని మాత్రం ముఖానికి ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
నిమ్మరసం.. నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది Pigmentation సమస్యకు చెక్ పెడుతుందని, ముఖాన్ని మరింత కాంతివంతంగా తయారుచేస్తుందని నిమ్మకాయ రసాన్ని ముఖానికి అప్లై చేస్తుంటారు. కానీ నేరుగా నిమ్మరసాన్ని ముఖానికి అస్సలు పెట్టకూడదు. ఇలా అప్లై చేస్తే నిమ్మలో ఉండే ఆమ్ల స్వభావం పీహెచ్ బ్యాలెన్స్ లేకుండా చేస్తుంది. దీంతో మీ చర్మం డ్రైగా మారడంతో పాటుగా స్కిన్ పై అలర్జీ కూడా వస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి అప్లై చేయకండి. ఏదైనా మిశ్రమంలో దీన్ని కొద్దిగా మిక్స్ చేసి పెట్టినా ఎటువంటి నష్టం ఉండదు. అది కూడా అరస్పూను కన్నా ఎక్కువగా ఉండకూడదు.
sugar
చక్కెర.. ముఖ చర్మంపై పేరుకుపోయిన మురికి పోతుందని చాలా మంది చక్కెరను స్క్రబ్ లా ఉపయోగిస్తుంటారు. షుగర్ ను ముఖంపై రుద్దడం వల్ల చర్మం పొడిబారడంతో పాటుగా, ముఖం మంట పుట్టడం, చికాకు పెట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు మొటిమలు పోవాలని ఉప్పును కానీ చక్కెరను గానీ ఎట్టిపరిస్థితో ఉపయోగించకూడదు. ఇవి వాడితే ముఖం మంటపుడుతుంది.
బేకింగ్ సోడా.. ముఖానికి సోడాను పెట్టడం వల్ల చర్మంపై ఉండే సహాజనూనెలు పోతాయి. దీంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు, ఇన్పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ బేకింగ్ సోడాను ముఖానికి అప్లై చేస్తే హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది.
దాల్చిన చెక్క పౌడర్.. దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనకు తెలుసే. కానీ దీని వల్ల అందం పెరుగదన్న ముచ్చటను మనం గుర్తించుకోవాలి. దాల్చినచెక్క పౌడర్ ను ముఖానికి అప్లై చేస్తే అందం పెరుగుతుందని ముఖానికి రాస్తే మాత్రం మీ చర్మం చికాకు పెడుతుంది. దీన్ని నేరుగా కాకుండా ఆలివ్ ఆయిల్ లేదా తేనేలో దీన్ని కలిపి ఫేస్ కు అప్లై చేసుకోవచ్చు.
వెజిటేబుల్ నూనెలు.. వెజిటేబుల్ నూనెలు ముఖానికి రాయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ నూనెలు వివిధ రసాయనాలతో ప్రాసెస్ చేయబడి ఉంటాయి. వీటిని నేరుగా ముఖానికి అప్లై చేస్తే మాత్రం చర్మ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.