Health care Tips: వీటిని తిన్నా క్యాన్సర్ బారిన పడతారు జాగ్రత్త..
Health care Tips: ప్రాణాంతక రోగాలలో క్యాన్సర్ కూడా ఒకటి. దీని లక్షణాలు అంత సులభంగా బయటపడవు. రోగం ముదిరాకనే ఈ రోగాన్ని గుర్తించగలం. అప్పుడు ఎంత మంచి చికిత్స తీసుకున్నా.. కోలుకోరన్న సంగతి అందరికీ బాగా తెలుసు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ వల్ల కూడా ఈ రోగం వచ్చే ప్రమాదం ఉంది.

cancer
Health care Tips: క్యాన్సర్ ఎంత ప్రమాదకారో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని బారిన పడట్టు అంత తొందరగా తెలియదు. రోగం ముదిరాకనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. అప్పుడు ఎంత మంచి చికిత్స తీసుకున్నా ఏం లాభం ఉండదు.
కొన్ని నివేధికల ప్రకారం... ప్రతి ఏడాది దేశంలో వేల మంది దీని బారిన పడి చనిపోతున్నారట. రొమ్ము క్యాన్సర్, ఉదర క్యాన్సర్, బోన్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ఎన్నో క్యాన్సర్ల మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ వ్యాధి సోకినవెంటనే తెలిస్తే మెరుగైన చికిత్స తీసుకుని ప్రాణాలను దక్కించుకోవచ్చు. కానీ ఇది అంత తొందరగా బయటపడదు కదా. రోగం మొత్తం ముదిరి ప్రాణం మీదికి వచ్చినాకనే దీని లక్షణాలు బయటపడతాయి. అలాంటి సమయంలో ఆ వ్యక్తిని బతికించడమనేది ఇంపాజిబుల్ అనే చెప్పాలి.
cancer
క్యాన్సర్ బారిన పడటానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇందులో చాలా వరకు మనం తీసుకునే ఫుడ్ వల్లే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఆహారంతో జన్యుపరంగా సోకే క్యాన్సర్ ను అడ్డుకోకపోవచ్చు. కానీ ఆహారం ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా వచ్చిన క్యాన్సర్లకు ఫుడ్ ద్వారా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.
మీకు తెలుసా.. ఇతర కారణాల వల్లే 80 శాతం క్యాన్సర్ కేసులు నమోదుతున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. క్యాన్సర్ బారిన పడేసే మూడు రకాల ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
ఫాస్ట్ ఫుడ్: ఫాస్ట్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఈ విషయం తెలిసినా.. చాలా మంది వాటిని తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పిజ్జాలు, బర్గర్లు లాగించేస్తూ శరీరానికి హానీ చేస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో రసాయన సమ్మేళనాలు చేరి .. మనం క్యాన్సర్ బారిన పడేట్టు చేస్తాయి. అలాగే వ్యంధ్యత్వం, కాలెయం దెబ్బతినడం వంటి రోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆల్కహాల్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అంటూ టీవీల్లో, సినిమా థియేటర్లతో పాటుగా ఆల్కహాల్ బాటిల్ పై కూడా ఉంటుంది. దాన్ని చదివి కూడా ఫుల్ గా తాగే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఆల్కహాల్ ను ఎక్కువగా తాగితే గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోరు, లివర్ క్యాన్సర్ బారిన పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆ మద్యం తాగే అలవాటును వెంటనే మానుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
soft drinks
సాఫ్ట్ డ్రింక్స్: మార్కెట్లో వీటి హవా బాగా పెరిగిపోయింది. సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. వీటిని మితిమీరి తాగుతున్నారు. వీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా.. అలాగే తాగేస్తున్నారు. కూల్ డ్రింక్స్ ను మితిమీరి సేవిస్తే మాత్రం ఊబకాయం బారిన పక్కగా పడతారు. తద్వారా మున్ముందు మీరు క్యాన్సర్ బారిన పడేఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.