Health Tips: చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..
Health Tips: రోజుకు కనీసం 10 నిమిషాలు నడిచినా.. మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుంటారు. అయితే కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Health Tips: మెరుగైన ఆరోగ్యానికి నడక ఎంతో అవసరం. రోజుకు కనీసం ఒక పది నిమిషాలు నడిచినా ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయినా చాలా మందికి నడవడానికి కూడా సమయం లేకుండా పోయింది. నాకెక్కడుంది టైం అంటూ పూర్తిగా నడవడమే మానేసిన వారు చాలా మందే ఉన్నారు. కానీ నడవక పోతే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే కొంతమంది ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా చెప్పులను వేసుకునే బయట అడుగుపెడతారు. కాళ్లకు దుమ్ము దూలి అంటకుండా, రాళ్లు ఒత్తుకపోకుండా వేసుకుంటారు. కానీ రోజులో కాసేపు చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మందిచని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలంలో చాలా మటుకు ఇలాగే నడిచే వారు. కానీ ఆ రోజులు ఇప్పుడు లేవు.
అందులోనూ చిన్న చిన్న పనులకు కూడా బైక్ లనే వాడుతున్నారు. పూర్తిగా నడవడమే మానేసారు. దీనిమూలంగా నేడు ఎంతో మంది అనేక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. నడిస్తే మన ఆరోగ్యం బాగుంటుందని మనకు తెలుసు. అయినా దీన్ని లైట్ గా తీసుకునే వారు లేకపోలేదు. ఈ సంగతి పక్కన పెడితే.. చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కల్పించడానికి ఈ నడక ఎంతో సహాయపడతుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. దాంతో తొందరగా నిద్రపడుతుంది.
చెప్పులు లేకుండా నడవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలనుకునే వారు చెప్పులు లేకుండా నడవండి.
కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు కూడా ఈ నడక బాగా ఉపయోగపడుతుందట.
Blood circulation సాఫీగా జరగడానికి కూడా వట్టి కాళ్ల ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి నిత్యం వట్టి కాళ్లతో నడవడం అలవాటు చేసుకోండి.
వట్టి కాళ్ల నడక తో మన Ions సమతుల్యంగా ఏర్పడి.. మన మెదడుపై ప్రభావం పడుతుంది. ఇది మెడదు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు ఆలోచనా విధానం కూడా మెరుగుపడుతుంది.