The undertaker Love story భయంకర WWE అండర్‌టేకర్ క్యూట్ ప్రేమకథ
WWE తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ అండర్ టేకర్ గురించి తెలిసే ఉంటుంది. బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి ఎవరైనా అండర్ టేకర్ ఒంటిచేత్తో మట్టి కరిపిస్తాడు. అంతటి భయంకరమైన అండర్ టేకర్ ది ఒక క్యూట్ ప్రేమకథ. తను రెజ్లర్ మిచెల్ మెక్‌కూల్ నే ప్రేమించి పెళ్లాడాడు.

WWE ప్రపంచంలో, అండర్‌టేకర్ (మార్క్ కాలవే), మిచెల్ మెక్‌కూల్ లాగా కొన్ని జంటలు మాత్రమే అభిమానుల హృదయాలను దోచుకున్నాయి. WWE ఐకాన్ అండర్‌టేకర్, ప్రతిభావంతులైన రెజ్లర్.. రెండుసార్లు మహిళల ఛాంపియన్ మిచెల్ మెక్‌కూల్, తొలిసారి ఓ WWE మ్యాచ్ లోనే ఎదుురుపడ్డారు.
కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసినా ఆ జంట ఒకర్నొకరు వదల్లేదు. ప్రేమతో ఒక్కటైన ఆ జంట 2010 లో వివాహం చేసుకున్నారు. తర్వాత వారి కెరీర్లో స్టార్‌డమ్ తోపాటు కొన్ని సవాళ్లూ ఎదుర్కొన్నారు.
అవకాశం వచ్చిన ప్రతిసారీ ‘రింగ్ లోపల, వెలుపల నా "బలం" అండర్ టేకరే అని మెక్ కూల్ ప్రేమగా అభివర్ణిస్తుంటుంది.
అండర్‌టేకర్, మిచెల్ మెక్‌కూల్ ప్రేమకథ సినిమా కథలకు ఏమాత్రం తీసిపోనిది. ఒకర్నొకరు క్షణం విడిచిపెట్టకుండా అంత సన్నిహితంగా ఉంటారు. వాలెంటైన్స్ డే వంటి ప్రతి సందర్భాన్ని ఆస్వాదిస్తారు.
అండర్ టేకర్ అంటే మనకు తన భయంకరమైన రూపం, పోరాటమే తెలుసు. కానీ మిచెల్ తరచుగా వారి జీవితంలోని సన్నివేశాలను పంచుకుంటుంది. అండర్‌టేకర్ సున్నిత మనస్తత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటుంది.