Motivation: నిజాయితీగా ఉంటే ఏం జరుగుతుంది.. ఆవు-పులి కథ చదివితే మీకే అర్థమవుతుంది.
కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. మనలో విలువలను పెంచుతాయి, మనుషులతో ఎలా వ్యవహరించాలనే గొప్ప సందేశాన్ని అందిస్తాయి. నిజాయితీగా జీవిస్తే జరిగే మంచి ఏంటో చెప్పే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
అడవిలో ఒక పులి ఆహారం కోసం వేటాడుతుంటుంది. అంతలోనే దానికి ఒక ఆవు కనిపిస్తుంది. దీంతో ఆవును చంపేందుకు దగ్గరికి వెళ్తుంది. అటాక్ చేసేందుకు ప్రయత్నించగానే. ఆవుకు తాను చనిపోవడం ఖాయమని అర్థమవుతుంది. దీంతో పులికి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. 'పులి రాజా.. మీకు నేను ఆహారం కావడానికి నాకు కొంత సహాయం ఇవ్వరా.? ఇంటికి వెళ్లి మా పిల్లల్ని ఒకసారి చూసి, వాటి ఆకలి తీర్చి వస్తాను' అని చెబుతుంది.
దీనికి బదులిచ్చిన పులి..'నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా.? నువ్వు మళ్లీ వస్తావని చెప్పగానే నమ్మడానికి' అంటుంది. అయితే ఆవు మాత్రం 'నేను ఇప్పటి వరకు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. కచ్చితంగా తిరిగి వస్తాను. సాయంత్రం వరకు సమయం ఇవ్వండి' అని బతిమలాడుతుంది. దీంతో ఆవు చెప్పింది విన్న పులికి నమ్మకం కుదిరి సరే అంటుంది.
పులి పర్మిషన్ ఇవ్వగానే ఇంటికి వెళ్లిన ఆవు తన పిల్లలకు కడుపునిండా పాలు ఇచ్చి.. జాగ్రత్తగా ఉండమని, యజమానాలు చెప్పింది వింటూ పని చేసుకోండని చెప్పి పులి దగ్గరికి తిరుగు ప్రయాణమవుతుంది. అయితే ఆవు ఎలాగో రాదని ఫిక్స్ అయిన పులి.. కాసేపయ్యాక నేరుగా వెళ్లి ఆవును చంపాలని ఆలోచిస్తుంటుంది. కానీ అంతలోనే అటుగా వస్తున్న పులిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇచ్చి మాట మేరకు చనిపోయేందుకు కూడా సిద్ధమైన ఆవును చూసి పులి ఆశ్చర్యపోతుంది. 'తప్పించుకునే అవకాశం ఉన్న కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తిరిగి వచ్చిన నీ నిజాయితీ చాలా గొప్పది. నేను నిన్ను చంపలేను. వెళ్లి నీ పిల్లలతో సంతోషంగా ఉండు' అని చెప్తుంది.
నీతి: తప్పు చేసే అవకాశం ఉన్న తప్పు చేయకపోవడం చాలా గొప్ప విషయం. అలాగే నిజాయితీగా జీవిస్తే ఎప్పటికీ మంచే జరుగుతుందన్న గొప్ప సందేశాన్ని ఈ కథ చెప్తోంది.