టీచర్స్ డే: టీచర్స్ కు ఇవ్వడానికి ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్స్ ఏముండవు..!
teachers day 2023: టీచర్స్ మన భవిష్యత్తుకోసం ఎంతో చేస్తారు. కానీ మనం వారికోసం చేసేదేమీ ఉండదు. మనం ఉన్నతస్థాయిలో ఉండటే వారు గొప్ప బహుమతిగా భావిస్తారు గురువులు. అయితే టీచర్స్ డే నాడు పిల్లలు తమ టీచర్స్ కోసం గిఫ్ట్ లను ఇస్తుంటారు. అయితే కొన్ని రకాల గిఫ్ట్ లను ఇస్తుంటే టీచర్స్ ఎంతో ఆనందిస్తారు తెలుసా?

teachers day
తల్లిదండ్రుల తర్వాత గురువులే మన జీవితం ఆనందంగా సాగాలని కోరకుంటారు. అందుకు మనల్ని తీర్చిదిద్దుతారు. గురువుల నుంచి పిల్లలు ఎన్నో విషయాలను నేర్చకుంటారు. గురువులు చెప్పిన మాటలే.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు అవుతాయి. అందుకే గురువుల గొప్పతనాన్ని లోకానికి తెలియజేయడానికి, వారి పట్ల మన కృతజ్ఞత, గౌరవాన్ని తెలియజేయడానికి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటారు. అయితే చాలా మంది గురువును గౌరవించడానికి వారికి గిఫ్ట్ లను కూడా ఇస్తుంటారు. మరి గురువులను సంతోషపెట్టే కొన్ని గిఫ్ట్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పర్సనలైజ్డ్ నోట్ ప్యాడ్ లేదా డైరీ
ఈ గిఫ్ట్ మీ టీచర్స్ కు ఎంతో నచ్చుతుంది. అవును రోజువారీ తరగతి క్లాస్ లెస్సన్స్, ఇతర కార్యకలాపాలను నోట్ చేసుకోవడానికి సహాయపడే టీచర్ డ్రాయర్ లో నోట్ ప్యాడ్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి గిఫ్ట్ ను మీ టీచర్ కు ఇవ్వండి. ఇదొక మంచి బహుమతి అవుతుంది. దీన్ని చూసి మీ టీచర్స్ ఎంతో సర్పైజ్ గా ఫీలవుతారు.
చేతిరాత లేఖ
డిజిటల్ మెసేజింగ్ యాప్స్, ఇమెయిల్స్ యుగంలో చేతిరాత లేఖ మీ టీచర్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టీచర్ పట్ల మీకున్న అభిప్రాయాన్ని, అందమైన జ్ఞాపకాలను పంచుకోండి. వీలైతే మీ టీచర్ గొప్పతనాన్ని కవిత రూపంలో రాయండి. అలాగే మీ టీచర్ మాటలు మీ జీవితాన్ని ఎలా సానుకూలంగా ప్రభావితం చేశాయో తెలియచేయండి. ఇది వారిని ఎంతో సంతోషించేలా చేస్తుంది.
హ్యాండ్ మేడ్ కార్డులు
టీచర్స్ డే రోజున బహుమతిగా ఇవ్వడానికి హ్యాండ్ మేడ్ కార్డ్ లు గొప్ప ఛాయస్. కలర్ పేపర్, మార్కర్స్, స్టిక్కర్స్, ఎమోజీలు లేదా మీకు నచ్చిన ఇతర మెటీరియల్ ఉపయోగించి మీరే సొంతంగా కార్డును తయారు చేయండి. అలాగే మీ టీచర్ పట్ల ఉన్న మీ అభిప్రాయాలను రాయండి.
తరగతి గది అవసరాలు
మీ టీచర్స్ క్లాస్ రూంలో ఎక్కువగా ఉపయోగించే నోట్స్, క్యాలెండర్లు లేదా విద్యా పోస్టర్లు వంటి వస్తువులను బహుమతిగా ఇవ్వడం కూడా మంచి ఆలోచనే. ఇది వారి అంకితభావం, కృషిని ప్రశంసించడానికి గొప్ప ఆచరణాత్మక, ఆలోచనాత్మక మార్గం.
మొక్క
ఈ టీచర్స్ డే రోజున మీ ఉపాధ్యాయుడికి మొక్కను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది మీ టీచర్ వర్క్ స్పేస్ కు ప్రకృతి అందాన్ని ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వారిని రిలాక్స్ చేస్తుంది.
పుస్తకం లేదా జర్నల్
మంచి పుస్తకాన్ని గిఫ్ట్ గా మీ టీచర్ కు ఇవ్వడం ఒక గొప్ప ఆలోచన. దీన్ని టీచర్స్ ఖచ్చితంగా ఏండ్ల తరబడి ఎంతో భద్రంగా దాచుకుంటారు. నిజానికి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం ఒక గొప్ప ఆలోచన. ఒక పుస్తకాన్ని కొనాలనుకున్నప్పుడు మీ టీచర్ కు ఎలాంటి పుస్తకం నచ్చుతుందో తెలుసుకోండి. వారికి ఇష్టమైన సబ్జెక్టు లేదా టాపిక్ గురించి ఒక పుస్తకాన్ని ఇవ్వొచ్చు. లేదా నచ్చిన కవితా పుస్తకం లేదా చిన్న కథల పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.