పుదీనా పప్పు ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు.. ఎలా చేయాలంటే?
పుదీనా మంచి సువాసన కలిగి వంటలకు మంచి రుచిని అందిస్తుంది. వంటింటిలో పుదీనా అందుబాటులో ఉన్నప్పుడు పుదీనా చట్నీ, పుదీనా రైస్ వంటి రెసిపీలను ట్రై చేస్తూంటాం.

ఇలా ఎప్పుడూ చేసుకునే రెసిపీలకు బదులుగా కాస్త వెరైటీగా (Variety) అన్ని ఆకుకూరల మాదిరిగా పుదీనాతో పప్పును కూడా వండుకోవచ్చు. ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం పుదీనా పప్పు (Pudina pappu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కట్ట పుదీనా (Mint), ఒక కప్పు పెసరపప్పు (Pesarappu), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), సగం స్పూన్ ఆవాలు (Mustard), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), చిటికెడు ఇంగువ (Asparagus), సగం స్పూన్ మినపప్పు (Minapappu), ఒక టేబుల్ స్పూన్ కారం (Chili powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు స్పూన్ ల నిమ్మరసం (Lemon juice), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee).
తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పెసరపప్పు వేసి తక్కువ మంట మీద మంచి వాసన వచ్చే వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పును కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉడికించుకుంటే పప్పు రుచిగా (Delicious) ఉంటుంది.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, చిటికెడు ఇంగువ, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన (Raw smell) పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పుదీనా ఆకులు వేసి తక్కువ మంట (Low flame) మీద ఫ్రై చేసుకోవాలి.
పుదీనా ఆకులు బాగా మగ్గిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును (Boiled pesarappu) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకొని (Mix well) పప్పును ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కలుపుకోవాలి. చివరిలో నిమ్మరసం కలుపుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది.
అంతే ఎంతో రుచికరమైన మళ్లీ మళ్లీ తినాలనిపించే పుదీనా పప్పు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. చపాతి, రోటి, అన్నంలోకి ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త రెసిపీలను ట్రై చేయండి.. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రుచులను (New flavors) ఆస్వాదించండి..