Mysore Bonda: వామ్మో.. మైసూర్ బోండాలను తింటే ఇన్ని సమస్యలొస్తాయా..?
Mysore Bonda: వేడి వేడి మైసూర్ బోండాలను తింటుంటే వచ్చే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది కదా.. దీని రుచి అమోఘం, అద్భుతం.. కానీ ఈ బోండాలు కొందరికి అస్సలు మంచివి కావు. వారు ఈ బోండాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకో తెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us

Mysore Bonda: వేడి వేడిగా మైసూర్ బోండాల్లో.. కాస్త పల్లీ చెట్నీ.. సాంబార్ వేసుకుని తింటుంటే వచ్చే ఆ మజానే వేరబ్బా.. అందులోనూ ఇవి రుచిలో ది బెస్ట్ అనిపించుకుంటాయి కూడా. అందుకే చాలా మంది దోశ కంటే ఈ బోండాలనే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి వేడిగా ఉన్నా.. చల్లగా ఉన్నా.. రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. అందుకేనేమో చాలా మంది వీటిని తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
అయితే చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వాస్తవానికి మైసూర్ బోండాలు రుచికే తప్ప మరే లాభం కలిగించవు.
వీటిని తినడం వల్ల వచ్చే లాభాలు ఒక్క శాతం కూడా లేవు. పైగా వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే ఈ బోండాలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి.
బోండాలను మైదాపిండి, బియ్యపు పిండి లో పెరుగును మిక్స్ చేసి తయారుచేస్తారు. ముఖ్యంగా మైదా పిండిని మిక్స్ చేసి తయారుచేసే ఈ ఫుడ్ అయినా సరే మన రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అమాంతం పెంచేస్తాయి. అందుకే వీటిని డయాబెటిక్ పేషెంట్లు ఎట్టి పరిస్థితిలో తినకూడదు.
హార్ట్ పేషెంట్లకలు కూడా ఈ బోండాలు అంత మంచివి కావు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటమే వారి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే బియ్యం పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు హార్ట్ పేషెంట్స్ కు హానీ కలిగిస్తాయి. ఇవి గుండె సమస్యలను మరింత పెంచుతాయి కూడా.
అలాగే డీప్ ఫ్రై చేసిన ఏ ఆహార పదార్థం కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. మురొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మైదాపిండిలో Bad cholesterol ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీని నిల్వలు మన బాడీలో పెరుగుతున్న కొద్దీ ఎన్నో రోగాలు అటాక్ చేస్తాయి.
ఈ బోండాలతో బరువు కూడా పెరుగుతారు. అంతేకాదు ఇది మన శరీర వేడిని కూడా పెంచుతుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుంది.
ముఖ్యంగా వీటిని రెగ్యులర్ గా తింటే హైబీపీ సమస్య కూడా వస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి మైదా పిండితో చేసిన ఆహారాలను తినకపోవడమే మంచిది.
మైసూర్ బోండాలను తరచుగా తింటుంటే పొట్ట రావడంతో పాటుగా పొట్టలో ఏదో బండరాయి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇక నుంచి మైసూర్ బోండాలకు దూరంగా ఉండండి..