తెల్ల జుట్టు నల్లగా అవుతుంది ఇవి తింటే..
ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కానీ దీనివల్ల పెద్ద వయసు వారిలా కనిపిస్తారు. అందుకే తెల్ల వెంట్రుకలు కనిపించకుండా కలర్ ను వేస్తుంటారు. కానీ కొన్నింటిని తింటే తెల్ల వెంట్రుకలు రావు. జుట్టు నల్లగా ఉంటుంది.

Gray Hair
ఒకప్పుడైతే పెద్ద వయసు వారికి మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోంది. ఇది వారిని పెద్దవారిలా కనిపించేలా చేయడమే కాకుండా.. వారి అందాన్ని తగ్గిస్తాయి. అందుకే చాలా మంది ఈ తెల్ల వెంట్రుకలను దాచేయడానికి వార వారం హెయిర్ కలర్ ను వాడుతుంటారు. కానీ ఈ కలర్లలో ఉండే కెమికల్స్ జుట్టును దెబ్బతీస్తాయి. దీనివల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. అలాగే డ్రైగా కూడా అవుతుంది.
Gray Hair
తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి, తెల్ల వెంట్రుకలు నల్లగా కావడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు తెలుసా? అవును కొన్ని సూపర్ ఫుడ్స్ తో కూడా మీరు తెల్ల వెంట్రుకలను నల్లగా చేసుకోవచ్చు. అలాగే చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బెర్రీలు
బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి తెల్ల జుట్టు రాకుండా సహాయపడతాయి. ఈ బెర్రీల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ కూడా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రోజూ లిమిట్ లో కొంచెం డార్క్ చాక్లెట్ ను తినాలి. డార్క్ చాక్లెట్ లో ఐరన్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని పెంచి వెంట్రుకలు నల్లగా ఉంచేలా చేస్తాయి.
ఆకుకూరలు
ఆకు కూరలను తిన్నా మీ జుట్టు తెల్లబడే అవకాశం ఉండదు. బచ్చలికూర, కాలే వంటి రకరకాల ఆకుకూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా ఉంచే మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. జుట్టును హెల్తీగా ఉంచుతాయి.
గుడ్లు
గుడ్లు పోషకాలకు మంచి వనరు. వీటిలో విటమిన్ బి12, ప్రోటీన్లు, బయోటిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే మీరు హెల్తీగా ఉండటమే కాకుండా.. మీజుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.
గింజలు, విత్తనాలు
వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు, చియా విత్తనాల్లో రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా జింక్, బయోటిన్ తో పాటుగా ఇతర పోషకాలు బాగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును బలంగా ఉంచడానికి, స్మూత్ గా చేయడానికి, చిన్న వయసులో జుట్టు తెల్లబడకుండా ఉండటానికి సహాయపడతాయి.
కొవ్వు చేపలు
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఇవి నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. అలాగే చిన్న వయసులో జుట్టు తెల్లబడకుండా ఉండటానికి సహాయపడతాయి.