చిట్లిన పొడిబారిన జుట్టు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూపర్ టిప్స్ ఇవే!
జుట్టు ఒత్తుగా, అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ముఖ అందానికి ఇచ్చిన ప్రాముఖ్యతను జుట్టు సంరక్షణపై (Hair care) పెట్టారు. దీంతో జుట్టు చివర చిట్లిపోయి, పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది.

జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. అలాగే జుట్టు అధిక మొత్తంలో రాలిపోతుంది. కనుక జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ కొన్ని సహజసిద్ధమైన హెయిర్ టిప్స్ (Natural hair tips) ను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్త్రీలకు పొడవైన, ఒత్తయిన, జుట్టు వారి అందాన్ని మరింత పెంచుతుంది. కానీ జుట్టు చివర్ల చిట్లిపోవడంతో జుట్టు పెరుగుదల ఆగిపోయి, పలుచగా, నిర్జీవంగా మారుతుంది. ఇందుకోసం తలస్నానం (Head bath) చేసే విషయంలో తగిన జాగ్రత్తలను (Precautions) తీసుకోవాలి. తలస్నానం చేయడానికి చాలా వేడిగా ఉన్న నీటిని ఉపయోగించరాదు. వేడినీరు తల కుదుర్లను బలహీనపరిచి జుట్టు పొడిబారడానికి కారణం అవుతుంది. దీంతో జుట్టు చివర్లో ఎక్కువగా చిట్లిపోతుంది.
తలస్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. అలాగే గాఢత తక్కువ గల షాంపులను తలస్నానికి ఉపయోగిస్తూ జుట్టుకు కండిషనర్ ను అప్లై చేసుకోవాలి. కండిషనర్ (Conditioner) జుట్టుకు బలాన్ని అందించి జుట్టు రాలేసమస్యలను తగ్గిస్తుంది. అలాగే తలస్నానం తరువాత జుట్టును ఎక్కువసేపు తడిగా ఉంచరాదు. ఇలా జుట్టు చివర్లో చిట్లి పోవడానికి ముఖ్య కారణం బలంగా దువ్వడం, విటమిన్ల లోపం, హెయిర్ డ్రయర్ల (Hair dryer) వాడకం.
కనుక ఎలక్ట్రిక్ హెయిర్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. జుట్టును ముడి వేయకుండా లూజ్ గా వదలడంతో కూడ జుట్టు చివర్లు పాడైపోతాయి. జుట్టు చివర్ల చిట్లి పోయి ఉంటే ప్రతి ఆరునెలలకు ఒకసారి జుట్టు చివర్లను కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు చిట్టడం తగ్గి జుట్టు వేగంగా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలను తీసుకుంటూ జుట్టుకు ప్రోటీన్లను (Proteins) అందించే హెయిర్ ప్యాక్స్ (Hair packs) ను అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను (Coconut oil) జుట్టుకు రాస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనె జుట్టుకు రక్షణ కవచంగా (Hair protection) సహాయపడి జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. కనుక కొబ్బరి నూనెను జుట్టు కుదుర్ల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా అప్లై చేసుకుని పది నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగల షాంపుతో తలస్నానం చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్ని అందించి జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తాయి.
అరటిపండు గుజ్జు, నిమ్మరసం: ఒక కప్పులో కొద్దిగా అరటిపండు గుజ్జు (Banana pulp), ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుగు, జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. గంట తరువాత గాఢత తక్కువ గల షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ఉండే పోషకాలు జుట్టు చిట్లడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా, పెరగడానికి సహాయపడతాయి. ఇలా వారానికి ఒకసారి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
బాదం నూనె: బాదం నూనెలో (Almond Oil) ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids), మెగ్నీషియం, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు సంరక్షణకు సహాయపడతాయి. కనుక బాదం నూనెను తలకు బాగా అప్లై చేసుకుని గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ నూనె జుట్టుకు కావలసిన పోషకాలను అందించి జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.