MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Vasant Panchami 2022.. ఈ రోజున ఏ దేవతను పూజించాలో తెలుసా...

Vasant Panchami 2022.. ఈ రోజున ఏ దేవతను పూజించాలో తెలుసా...

Vasant Panchami 2022: మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 5వ తేదీన రానుంది. కాగా ఆ రోజు భారతదేశంలో ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అంతేకాదు వసంత పంచమి రోజు నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 04 2022, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


Vasant Panchami 2022: మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఇది రుతు సంబంధమైన పండుగ కావడంతోనే వసంత పంచమి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. ఈ వసంత పంచమినే మదన పంచమి అని శ్రీ పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. కాగా భారతదేశంలో ఈ పండగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 వ తేదీన వచ్చింది. ఆ రోజున చదువుల తల్లి సరస్వతి తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు వసంత రుతు లక్షణాలు మకర సంక్రాంతి పండుగ తర్వాతి నుంచే కనిపిస్తాయి. చెట్లు పూలు పూయడం, చిగురించడం వంటివి ఈ రుతువు ప్రారంభానికి సంకేతాలు. వసంతుడికి వెల్కమ్ పలుకుతూ Nature ఇలా చిగురిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వసంత పంచమి ఎల్లలు లేని ఎన్నో ఆనందాలను మూటగట్టుకుని వస్తుంది. ఆ రోజున తప్పని సరిగా హరి పూజలను నిర్వహిస్తారు. అంతకాదు రంగులు కూడా జల్లుకుంటారు. ముఖ్యంగా రైతన్నలకు కొత్త ధాన్యం వచ్చే రోజులివే. అందుకే ఈ సమయంలోనే కొత్త బియ్యంతో పాయడం చేసి దేవుళ్లకు నైవేధ్యంగా పెడతారు. అంతేకాదు వసంత పంచమి రోజునే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ రోజున ఆ దేవతను భక్తీ శ్రద్దలతో నిష్టగా పూజిస్తారు. అంతేకాదు ఆ దేవతను సాయం కాలం వరకు ఎంతో నిష్టగా పూజించి ఊరేంగించి నిమజ్జనం కూడా చేస్తారు.  కాగా ఈ పండుగను రాజస్థాన్ లో ఘనంగా జరుపుకుంటారు. 
 

34

ఈ వసంత పంచమి రోజునే రతీదేవిని, కామదేవుడిని, వసంతుడు భక్తులచే పూజలు అందుకుంటారు. ఈ ముగ్గురిని ఒకే రోజున పూజించడం వల్ల జనాల మధ్య ప్రేమాభిమానులు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ పూజ వల్ల జ్ఞానం పెరుగుతుందట. ఈ పండుగ ప్రారంభంతో వాతావరణం శోభాయమానంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులోనూ ఈ రుతువుతోనే కొత్త పంటలు వస్తాయి. అంతేకాదు పశువులకు కూడా గ్రాసం మెండుగా లభిస్తుంది. 
 

44

ఈ వసంత పంచమినాడే సరస్వతి జయంతి అవడంతో ఈ పండుగ మరింత విశిష్టతను సంతరించుకుంది. అందుకే ఆ రోజున చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా పుస్తకాలను, కలాలను అమ్మవారు సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. అంతేకాదు చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజున తమ పిల్లలకు సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఎందుకంటే అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం చేయించడం వల్ల పిల్లలు జ్ఞానరాశులు అవుతారని పురాణాలు చెబుతున్నారు. అంతేకాదు ఆ దేవిని ఆరాధించడం వల్ల వాక్సుద్ధి కలుగుతుందని పెద్దలు విశ్వసిస్తున్నారు. అలాగే మనపై ఆ అమ్మకారి కరుణ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆరోజున తెల్లని లేదా పచ్చని వస్త్రాలతో నిష్టగా పూజలుచేస్తే ఆ తల్లి చల్లని చూపులు మనపై ఎప్పుడూ ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాగా ఆ రోజున ఆ తల్లికి చెరకును, అరటిపండ్లను నైవేద్యంగా పెడతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved