MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే..!

Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే..!

Sperm Count: సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు కేవలం అమ్మాయిల్లోనే ఉంటాయని ఈ సమాజం గట్టిగా నమ్ముతుంది. నిజానికి అమ్మాయిలతో పాటుగా అబ్బాయిల్లో కూడా ఈ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Mahesh Rajamoni | Published : Jul 16 2022, 12:55 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే కొంతమంది ఆడవారిలోనే ఈ సమస్య ఉన్నట్టుగా భావిస్తారు. నిజానికి అమ్మాయిల్లో కాదు.. అబ్బాయిల్లో కూడా వంధ్యత్వ సమస్యలు ఉంటాయి. దీనివల్లే సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు భావిస్తున్నారు. 
 

29
sperm

sperm

నిజానికి వంధ్యత్వ సమస్యలు మహిళల్లో లాగే పురుషుల్లో కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా పురుషులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యల్లో తక్కువ స్పెర్మ్ ఒకటి. దీనివల్ల భాగస్వామి  గర్భం దాల్చడం కష్టమవుతుంది. మరి ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ..

39
sperm

sperm

ధూమపానం, మద్యపానం

ఆల్కహాల్, సిగరేట్ల  అలవాట్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటివల్ల  ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గుతుంది. ముఖ్యంగా ఈ అలవాట్ల వల్ల వృషణాలు కుంచించుకుపోతాయి. అలాగే సెక్స్  హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని. ఫలితంగా స్పెర్మ్ కౌంగ్ దారుణంగా పడిపోతుంది. 
 

49
sperm

sperm

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడికి గురికాని వారు ఈ రోజుల్లో చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే గజిబిజీ లైఫ్, పని ఒత్తిడి, ఇంటి సమస్యల కారణంగా చాలా మంది మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కాని దీన్ని చిన్న సమస్యగా తీసిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఒత్తిడి ఎన్నో శరీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్య బారిన పడతారు. దీంతో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. 
 

59
sperm

sperm

డిప్రెషన్

ఒత్తిడితో పాటుగా డిప్రెషన్ సమస్య కూడా ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా చాలా మంది పురుషుల నిరాశతో బాధపడుతున్నారని పలు సర్వేలే చెబుతున్నాయి. అయితే మానసిక సమస్యల కారణంగా కూడా స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. 
 

69
Asianet Image

స్థూలకాయం

స్థూలకాయం గుండె జబ్బుల నుంచి ఎన్నో రోగాలకు కాణమవుతుంది. ముఖ్యంగా స్థూలకాయం వల్ల సంతానోత్పత్తి సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే ఇది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది. 
 

79
Asianet Image

అధిక వేడి

అధిక వేడి కూడా స్మెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుంది. వృషణాలకు ఎప్పుడూ వేడి తగలడం వల్ల స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గుతుందట. వంధ్యత్వ రేటు ఇతర సీజన్లతో పోలిస్తే వేడి ఎక్కువగా ఉండే సీజన్లలో, వేడిగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుందట. 
 

89
Asianet Image

కొన్ని రకాల రోగాలు కూడా పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి. అందులో ఒకటైన టైప్  2 డయాబెటీస్ కారణంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. తద్వారా వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. 

99
Asianet Image

కొన్ని రకాల అంటు వ్యాధులు కూడా స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంటే  వృషణాలను ప్రభావితం చేసే అంటువ్యాధులు, ఇతర రోగాల కారణంగా  వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
జీవనశైలి
పురుషులు
 
Recommended Stories
Top Stories