ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా స్పెషల్ తెలుసా?
సాధారణంగా మనం వ్యక్తులను, వారి ప్రవర్తన, మాట్లాడే తీరును బట్టి వారు ఎలాంటివారో ప్రాథమిక అంచనాకు వస్తాము. కానీ బ్లడ్ గ్రూపును బట్టి కూడా మనుషులు ఎలాంటి వారో.. వారి గుణాలు ఏంటో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఒక్కో గ్రూపు వ్యక్తులు ఒక్కో రకంగా ఉంటారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా O+ బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు.

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. అయితే రక్తం రకాన్ని బట్టి కూడా వారి లక్షణాలు వేరుగా ఉంటాయంటున్నారు నిపుణులు. O+ బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తుల గురించి చాలా విషయాలు చెబుతున్నారు.
సమస్యలు తక్కువ
O పాజిటివ్ బ్లడ్ గ్రూపు ఉన్నవారి జీర్ణశక్తి బలంగా ఉంటుంది. కడుపు సమస్యలు తక్కువ. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు.
చురుకుగా..
O+ రక్తం కలిగినవారు చురుకుగా, బలంగా ఉంటారు. మానసికంగానూ దృఢంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
టెన్షన్ పడరు
మానసిక ఒత్తిడి కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. 'A' గ్రూప్ రక్తం కలిగివారికి కార్టిసాల్ ఎక్కువ. కానీ O+ వారికి ఈ సమస్య తక్కువ. వీరు త్వరగా టెన్షన్ పడరు.
నాయకత్వ లక్షణాలు
O+ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వారు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏ పనినీ తేలికగా వదులుకోరు.
వ్యాధులు తక్కువ
ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే O+ వారికి గుండెపోటు, కొన్ని క్యాన్సర్లు, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. దీనివల్ల వారు ఎక్కువ కాలం బతుకుతారు.
యూనివర్సల్ డోనర్
O+ బ్లడ్ గ్రూపు వారు ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే అందరూ వారిని ఇష్టపడతారు. O+ అంటే యూనివర్సల్ డోనర్. వారి రక్తాన్ని అన్నిగ్రూపుల వారికీ ఇవ్వొచ్చు.