Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లు తెల్లగా కావాలంటే ఇలా చేయండి

నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లు తెల్లగా కావాలంటే ఇలా చేయండి

మోచేతులు, మోకాళ్లు నల్లగా మారడానికి కారణాలెన్నో ఉన్నాయి. అయితే వీటిని కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి తెల్లగా చేయొచ్చు. అవేంటంటే..  

Mahesh Rajamoni | Published : Jan 13 2023, 03:49 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
elbow

elbow

మనలో చాలా మంది చర్మం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. శరీరంలో ప్రతి భాగాన్ని తెల్లగా మార్చడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. చాలా సార్లు మంచి ఫలితాలే వస్తాయి. కానీ మోకాళ్లు, మోచేతులు మాత్రం మిగతా చర్మం కంటే కాస్త నల్లగానే ఉంటాయి. అది కూడా కొంతమందికి. ఎందుకంటే ఇతర భాగాల్లో మాదిరిగా మోచేతులను, మోకాళ్లను సరిగ్గా శుభ్రం చేయరు. దీనివల్ల అక్కడ మురికి పేరుకుపోయి నల్లగా మారతాయి. మరీ దీన్ని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27
elbow

elbow

మోచేతులు, మోకాళ్లు నల్లగా మారడానికి కారణాలు

మోచేతులు, మోకాళ్లు నల్లగా మారడానికి కారణాలు చాలానే ఉన్నాయి.ఈ భాగాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, మోచేతులు, మోకాళ్లలో దూళి పేరుకుపోవడం, చెమట వంటి కారణాల వల్ల ఈ భాగాలు నల్లగా మారతాయి.  దీనివల్ల క్రమంగా ఈ భాగాలు పూర్తిగా నల్లగా మారతాయి. చర్మ సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది మెలనిన్ వల్ల వస్తుంది. ఇది పిగ్మెంటేషన్ ను పెంచుతుంది. దీనివల్ల చర్మంలోని చాలా భాగాల్లో నల్లగా అవుతుంది. మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉండటం వల్ల చాలా మంది నలుగురిలో ఇబ్బంది పడుతుంటారు. ఇష్టమైన డ్రెస్ లను కూడా వేసుకోరు. అయితే ఈ సమస్యలను కొన్ని సింపుల్ చిట్కాలతో వదిలించుకోవచ్చు. 
 

37
Asianet Image

మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉంటే క్రమం తప్పకుడా మాయిశ్చరైజ్ చేయండి. నలుపు రంగు పోవడానికి పిగ్మెంట్ లైటెనింగ్ క్రీం ను అప్లై చేయండి. టిసిఎ లేదా సాలిసిలిక్ యాసిడ్ పీల్ ను కూడా అప్లై చేయొచ్చు. ఇది కూడా మీ మోచేతులను, మోకాళ్లను తెల్లగా, అందంగా మారుస్తుంది. 

47
Asianet Image

ఇవే కావు బేకింగ్ సోడా, నిమ్మకాయ తో కూడా మోకాళ్లు, మోచేతుల నలుపుదనాన్ని వదిలించుకోవచ్చు. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని అందులో నిమ్మకాయ రసం కలిపి పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు, మోకాళ్లకు అప్లై చేయండి. కొద్ది సేపటి తర్వాత నీట్ గా కడిగేయండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్ల నలుపు దనం పోతుంది. 
 

57
elbow dark

elbow dark

నిమ్మకాయ కూడా ఈ భాగాలపై నలుపును పోగొడుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే సహజ బ్లీచింగ్ లక్షణాలు మురికిని తొలగిస్తాయి. అలాగే స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి. ఇందుకోసం నిమ్మరసం తీసుకుని మోచేతులపై, మోకాళ్లపై రుద్దండి. కొద్దిసేపు మసాజ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. కొన్ని వారాల పాటు ఇలా చేస్తే తేడాను మీరే గమనిస్తారు. 

67
<p>dark elbow</p>

<p>dark elbow</p>

పెరుగు మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అందుకే చాలా మంది పెరుగును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. పెరుగుపు చర్మానికి మాత్రమే కాదు హెయిర్ కు కూడా అప్లై చేస్తుంటారు. ఇకపోతే పెరుగుతో మోకాళ్లు, మోచేతుల నలుపుదనానికి చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం కొద్దిగా పెరుగును తీసుకుని అందులో టీస్పూన్ గ్రామ్ పిండిని, వెనిగర్ ను వేసి బాగా కలపండి. దీన్ని ఆ భాగాలకు బాగా పట్టించండి. 10 నిమిషాల తర్వాత నీట్ గా కడిగేయండి. 

77
<p>dark circles in elbow</p>

<p>dark circles in elbow</p>

అయితే మోకాళ్లపై రోజూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల, మోచేతును నేలపై ఎక్కువ గంటలు ఆనించి ఉంచడం వల్ల కూడా ఈ భాగాలు నల్లగా మారతాయి. ఈ అలవాట్ల వల్ల నలుపుదనం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాలను నేలపై ఎక్కువ సేపు ఉంచితే ఆ  ప్లేస్ పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోండి. లేకుండే పరిశుభ్రంగా చేసి మాత్రమే పెట్టండి.  

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
జీవనశైలి
 
Recommended Stories
Top Stories