MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కలబందను పెడితే జుట్టు జిడ్డుగా మారుతుందా?

కలబందను పెడితే జుట్టు జిడ్డుగా మారుతుందా?

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన చర్మానికే కాదు జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా మారుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే చాలా మంది కలబందను విపరీతంగా వాడేస్తుంటారు. కానీ కలబందను మరీ ఎక్కువగా పెడితే ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 06 2023, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కలబంద మన ఆరోగ్యానికే కాదు చర్మం, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది జుట్టును అందంగా, ఒత్తుగా మార్చడానికి, ఊడిపోకుండా కాపాడటానికి కలబంద జెల్ ను నెత్తికి తరచుగా పెడుతూ ఉంటారు. నిజానికి నెత్తిమీద దుమ్ము పేరుకుపోవడం, శరీరంలో పోషకాలు లోపించడం వల్ల వెంట్రుకలు రెండుగా చీలిపోవడంతో పాటుగా రాలిపోతూ ఉంటాయి. అలాగే వెంట్రుకలు జీవం లేనట్టుగా కూడా  కనిపిస్తాయి. అలాంటప్పుడు అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద జెల్ జుట్టును దృఢంగా మారుస్తుంది. కానీ కలబంద జెల్ ను మోతాదుకు మించి ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. అసలు కలబంద జెల్ ను ఎక్కువగా నెత్తికి అప్లై చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

26

దురద సమస్య

కలబంద జెల్ ను నెత్తికి అప్లై చేయడం వల్ల నెత్తిమీదున్న చుండ్రు పోతుంది. దురద కూడా తగ్గుతుంది. అయితే దీన్ని మోతాదుకు మించి నెత్తికి పెడితే కూడా తలపై దురద, బర్నింగ్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

36

నెత్తిమీద క్రస్ట్ 

కొన్ని కొన్ని సార్లు కలబంద జెల్ ను నెత్తిమీద అప్లై చేయడం వల్ల నెత్తిమీద క్రస్ట్ లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిపై మనం దృష్టి పెట్టం. దీనివల్ల ఇవి బాగా పెరుగుతాయి. ఇది మీ నెత్తి దెబ్బతినడానికి కారణమవుతుంది.

46

జలుబు

కలబందను మరీ ఎక్కువగా వాడితే కూడా కొన్ని కొన్ని సార్లు జలుబు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కలబందలో చలువ చేసే గుణముంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా వాడితే జలుబు వస్తుంది. 

56

జిడ్డుగల జుట్టు

కలబంద జెల్ మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని వాడటం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. మృదువుగా మారుతుంది. కానీ కొన్నిసార్లు దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగల జుట్టు ఉన్నవారు కలబంద జెల్ వాడకపోవడమే బెటర్. 
 

66

బొబ్బలు

మంచి చేస్తుందని చాలా మంది దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఇది నెత్తి బొబ్బలను కలిగిస్తుంది. ఇవి చాలా నొప్పి పెడతాయి. అందుకే వారానికి 1-2 సార్ల కంటే ఎక్కువ సార్లు అలోవెరా జెల్ ను ఉపయోగించకుండా ఉండాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
సౌందర్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం తగ్గితే.. ఇన్ని సమస్యలా..!
Recommended image2
Luxury Homes: మీ ఇంటికి రాయల్ లుక్ ఇచ్చే 5 మొక్కలు ఇవే!
Recommended image3
Viagra History: వయగ్రా ఎందుకోసం తయారు చేశారో తెలుసా? అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved