MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వామ్మో.. పాలు ఎక్కువగా తాగితే గుండె జబ్బులొస్తయా..?

వామ్మో.. పాలు ఎక్కువగా తాగితే గుండె జబ్బులొస్తయా..?

పాలు మనకు మేలే చేసేవే అయినా.. మరీ ఎక్కువగా తాగితే ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2022, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఆవు పాలు పిల్లలతో పాటుగా పెద్దలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వీటిని ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలియదు. దీనవల్లే ఆరోగ్యంగా ఉండాల్సిన వారు అనారోగ్యం బారిన పడుతున్నారు.  మానవులు 11,000 సంవత్సరాల క్రితం ఆవులను పెంచడం ప్రారంభించారు. కానీ పాలలో ఉండే లాక్టోస్ చక్కెరను జీర్ణం చేసే సామర్థ్యం 10,000 సంవత్సరాల క్రితం మాత్రమే మానవులలో ఉద్భవించింది. నేటికీ..  ప్రపంచంలో కేవలం 30 శాతం మందిలో మాత్రమే పెద్దవారైన తరువాత లాక్టేజ్ అనే ఎంజైమ్ ఏర్పడుతుంది. ఇది పాలను బాగా జీర్ణం చేస్తుంది. లాక్టోస్ షుగర్ ను జీర్ణించుకోలేని వారు రకరకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆవు పాలు ప్రోటీన్, కాల్షియం యొక్క ప్రధాన వనరు. వీటితో పాటుగా పాలలో విటమిన్ బి-12, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముక పెరుగుదల, కండరాల పనితీరుకు సహాయపడే మెగ్నీషియంను కూడా కలిగి ఉంటుంది.

36

ఒకటి నుంచి మూడేండ్ల పిల్లలకు పాలు ఎంత పరిమాణంలో ఇవ్వాలి.. 

ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సరైన ఎముక అభివృద్ధి కోసం 350 మిల్లీగ్రాముల కాల్షియం ఇవ్వాలని యుకె నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంది. ఇది ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా లభిస్తుంది. అందుకే పిల్లలకు మొత్తం పాలే కాకుండా మరేదైనా తినిపించాలి. తద్వారా వారు అన్ని రకాల పోషకాలను పొందగలుగుతారు. చాలా ఇళ్ళలో ప్రజలు పిల్లలకు పాలనే ఎక్కువగా ఇస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇది మీ బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు నిలిపివేస్తుంది. 

46

పాలు ఎక్కువగా తాగడం వల్ల ఎముక పగుళ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి

ఇక పెద్దల గురించి చెప్పుకున్నట్టైతే..  వీరు పాలను ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయని అనేక పరిశోధనలు వెల్లడించాయి. స్వీడన్ లో నిర్వహించిన ఒక పరిశోధనలో.. ఎముకల పగుళ్ల సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు ఎక్కువ పాలను తాగడం వల్లే ఆ సమస్య వచ్చిందని కనుగొనబడింది.
 

56
एनीमिया से बचाता है सोया मिल्क

एनीमिया से बचाता है सोया मिल्क

పాలలో ఉండే లూబ్రికేషన్ గుండె జబ్బులకు కారణమవుతుంది..

పాలలో లూబ్రికేషన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫిన్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జెరికా విరాటన్ ప్రకారం.. పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అది తీసుకున్న తర్వాత ఆకలి పోతుంది. దీని కారణంగా ప్రజలు ఇతర పోషకాహారాన్ని తీసుకోరు. ఇది ఎక్కువ గుండె జబ్బులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది.
 

66

పిల్లలకు ఆవు పాలు మాత్రమే ఇవ్వండి..

ఈ పరిశోధనలన్నింటినీ పరిశీలిస్తే.. పాలకు మరొక ప్రత్యామ్నాయం కనుగొనబడింది. బాదం పాలు, సోయా పాలు, ఓట్స్ పాలు వంటి ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పిల్లలను ఈ పాలన్నింటికీ దూరంగా ఉంచాలి. పిల్లల ఎదుగుదలకు ఆవు పాలే ఉత్తమమైనవి. అవును ఆవు పాలను జీర్ణం చేసుకోలేని పెద్దలు మాత్రమే పాల ప్రత్యమ్నాయాలను తీసుకోవాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Almond Kajal: ఈ కాటుక పెట్టుకుంటే చాలు.. కలువల్లాంటి కళ్లు మీ సొంతం
Recommended image2
Ambani: అంబానీ కోడళ్లు... వారి భర్తల కంటే పెద్దవారా? ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Recommended image3
Rose Gold Earrings: ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త జ్యూవెలరీ..ట్రై చేశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved