జుట్టుకు రంగును ఎక్కువగా వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది తెల్ల జుట్టును దాచడానికి హెయిర్ కలర్ ను వేసుకుంటుంటారు. కానీ తరచుగా జుట్టుకు రంగును వేయడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

హెయిర్ కలర్
జుట్టుకు రంగును వేసుకునేవారు చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే హెయిర్ కలర్ ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కొంతమంది తెల్ల జుట్టును దాచుకోవడానికని జుట్టుకు రంగేస్తే.. మరికొంతమంది ఇష్టంలో రంగు వేయించుకుంటున్నారు. హెయిర్ కలర్ వల్ల మీరు అందంగా కనిపించినా.. దీన్ని ఎక్కువగా వేసుకుంటే మాత్రం మీకు ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అసలు హెయిర్ కలర్ మీ జుట్టును ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టుకు రంగు ఎలా వేయాలి?
హెయిర్ కలర్ వల్ల సమస్యలు ఉన్నాయి కదా అని మొత్తమే దీన్ని వేసుకోవద్దని కాదు. కానీ హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నేచురల్ కలర్స్
హానికరమైన కెమికల్స్ ఉన్న రంగులే కాదు.. హెర్బల్, నేచురల్ హెయిర్ కలర్స్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి. వీటిలో హానికరమైన రసాయనాలు చాలా తక్కువగా ఉంటాయి. హెన్నా, హెర్బల్ పౌడర్ వంటి సహజ పదార్థాలను ఉపయోగించి మీరు తెల్ల జుట్టును నల్లగా కూడా చేయొచ్చు. వీటివల్ల జుట్టు డ్యామేజ్ కాదు. ఆరోగ్యంగానూ ఉంటుంది.
ప్రొఫెషనల్ సలహా తీసుకోండి
మీరు కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్ ను వాడాలనుకుంటే గనుక ఖచ్చితంగా ప్రొఫెషనల్ సలహాను ఖచ్చితంగా తీసుకోండి. దీనివల్ల మీకు సరైన ఉత్పత్తులను వాడుతారు. దీనివల్ల మీ జుట్టు డ్యామేజ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
హెయిర్ కలర్ వేసుకోవడానికి ఎంత గ్యాప్ ఉండాలి
హెయిర్ కలర్ ను తరచుగా వాడితే మీ జుట్టు రాలి పల్చబడే అవకాశం ఉంది. అలాగే జుట్టు నిర్జీవంగా కూడా మారుతుంది. అందుకే హెయిర్ కలర్ ను వారానికి లేదా పది రోజులకు వేసుకోవడం మానేయండి. ఒకసారి రంగు వేసుకున్న తర్వాత ఇంకోసారి రంగు వేసుకోవాలంటే కనీసం 3 నుంచి 4 నెలల గ్యాప్ ఉండాలి.
అలాగే హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత హెయిర్ కేర్ చాలా అవసరం. కలర్ సేఫ్ కండీషనర్ ను లేదా షాంపూను ఖచ్చితంగా వాడండి. అలాగే వారానికి ఒకసారైనా జుట్టుకు నూనె పెట్టి మసాజ్ చేయాలి.