Beauty Tips: రఫ్ హాండ్స్ ని స్మూత్ గా చేయాలంటే.. ఈ అరోమో ఆయిల్ మానిక్యూర్ ప్రయత్నించండి!
Beauty Tips: చేతులతో మనం ఎన్నో పనులు చేస్తాం. దాని వలన చేతులు రఫ్ గా, మొద్దు బారిపోయినట్లుగా ఉంటాయి. అయితే వాటిని స్మూత్ గా తయారు చేసుకోవాలంటే ఈ హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు బ్యూటీషియన్స్ అదెలాగో చూద్దాం.
చేతులు కాళ్లు అందంగా ఉండటం కోసం సాధారణంగా మనం మానిక్యూర్, పెడిక్యూర్ లు చేయించుకుంటాము. అయితే చేతులు మరింత మృదువుగా రావడానికి, రక్తప్రసరణ సరిగ్గా జరగటానికి హాట్ ఆయిల్ మానిక్యూర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పెద్ద పెద్ద స్పా లలో చేసే హ్యాండ్ స్పా.
పార్లల్లో చేయించుకుంటే దీనికి చాలా ఖర్చవుతుంది. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుందాం. దీనిని తయారు చేసుకునే విధానం.ముందుగా సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో తీసుకోండి.
అందులో ఐదు టేబుల్ స్పూన్లు బాదం నూనె మరియు విటమిన్ ఈ, టీ ట్రీ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్, గులాబీ రేకులు తీసుకోండి. ముందుగా అన్ని నూనెలని కలిపి ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సిన్ తెరిచి..
ఆ నూనెను పై నూనెల మిశ్రమంలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఎనిమిది సెకండ్ల పాటు తక్కువ మంట మీద వేడి చేయండి. తర్వాత ఈ నూనెలో గులాబీ రేకులను వేయండి, తర్వాత లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపండి
తర్వాత మీ చేతులను అందులో ముంచండి. వెచ్చదనం మీ చేతులనకు ఉపశమనం కలిగిస్తుంది మరియు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాసేపటి తర్వాత ఈ మిశ్రమం చల్లారిపోతుంది. తర్వాత దానిని మళ్లీ వేడి చేసి మీ రెండు చేతులను పెట్టండి.
20 నిమిషాల తర్వాత చేతులను బయటకు తీసి మీ చేతులకు వుండే నూనెను అదే చేతులకు మసాజ్ లాగా చేయండి. 10 నిమిషాల తర్వాత మీరు పిండితో చేతులను శుభ్రం చేసుకోవచ్చు. దీనివలన మీ చేతులు చాలా మృదువుగా మనోహరంగా ఉంటాయి.