Lip Care Tips:మీ పెదాలు ఎర్రగా, గులాబీ రేకుల్లా అందంగా తయారవ్వాలంటే ఇలా చేయండి..
Lip Care Tips: పెదాలు అందంగా ఉంటేనే ముఖానికి మరింత అందం పెరుగుతుంది. అయితే కొందరి పెదాలు నల్లగా ఉంటే కొందరి పెదాలు ఎర్రగా గులాబీల్లా ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే నల్లని పెదాలు సైతం ఎర్రగా మారిపోతాయి. అవేంటంటే..

Lip Care Tips: గులాబీల్లాంటి పెదాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎంతైనా పెదాలు అందంగా ఉంటేనే కదా మన ఫేస్ మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
కొందరి పెదాలు గులాబీల్లా, ఎర్ర దొండపండులా ఉంటే.. మరికొందరి పెదాలు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్లని పెదాలను ఎర్రగా మార్చే చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే నలుపుదనం పోయి మీ పెదాలు ఎర్రగా గులాబీ రేకుల్లా తయారవుతాయి. అంతేకాదు ఈ చిట్కాలతో పెదాలు పొడిబారడం, గరుకుగా మారడం, పొలుసులుగా మారడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
మరి ఈ సీజన్ లో పెదాలు పగలకుండా ఉండాలంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఎంతో అవసరం. పెదాలు అందంగా, మృదువుగా ఉండాలంటే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి.
ఎక్కువగా నీళ్లను తాగాలి.. మారుతున్న వాతావరణంలో మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. శరీరానికి సరిపడా నీళ్లను తాగకపోతేనే మీ చర్మం, పెదాలు పొడిబారిపోతాయి. నీళ్లను తాగడం వల్ల ఇవి హైడ్రేటెడ్ గా ఉంటాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను కూడా నీళ్లు బయటకు పంపుతాయి. అంతేకాదు నీళ్లతోనే మీ పెదాలు తేమగా ఉంటాయి. దీంతోనే మీ లిప్స్ మృదువుగా ఉంటాయి. కానీ పెదాలను ఎప్పుడూ నాలుకతో తడపకూడదు. ఇలా చేస్తేనే మీ పెదాలు పగులుతాయి.
lips
మాయిశ్చరైజర్.. మాయిశ్చరైజర్ కేవలం చర్మానికే కాదు.. పెదాలకు కూడా పెట్టొచ్చు. మాయిశ్చరైజర్ వల్ల పెదాలు స్మూత్ గా అందంగా తయారవుతాయి. ఇందుకోసం మీ పెదాలకు కొబ్బరి నూనె సిరం లేదా బాదం సిరం నూనెను ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రతిరోజూ పడుకునే ముందు వీటిలో ఏదో ఒకదాన్ని పెదాలకు పెట్టండి. ఈ మాయిశ్చరైజర్ ను ఇంట్లో తయారుచేయాలనుకుంటే ఇలా చేయండి.. టీ స్పూన్ బాదం లేదా.. కొబ్బరి నూనె సిరం తీసుకుని అందులో విటమిన్ సి క్యాప్యూల్ తో పాటుగా కొన్ని చుక్కల గ్లిజరిన్ ను వేసి బాగా కలపండి. ఈ సిరం ను ప్రతిరోజూ పడుకునే ముందు పెదాలకు అప్లై చేయండి. కొన్ని రోజుల పాటు దీన్నిపెడితే.. మీ పెదాలు గులాబీ రేకుల్లా తయారవుతాయి.
మాస్క్ లను అప్లై చేయండి.. ముఖానికి, జుట్టుకే కాదు పెదాల సంరక్షణ కోసం వీటికి కూడా మాస్క్ లను అప్లై చేయొచ్చు. లిప్ మాస్క్ ను తయారుచేయాలంటే ముందుకు టీ స్పూన్ తేనెను తీసుకుని అందులో కొన్ని చుక్కల కొబ్బరినూనెను మిక్స్ చేయండి. దీన్ని బాగా కలిపి స్పూన్ తో పెదాలకు అప్లై చేసి.. సెల్లోఫిన్ తో పెదాలను కవర్ చేయండి. దీనివల్ల లిప్ మాస్క్ డ్రిప్పింగ్ కాకుండా ఉంటుంది. తేమను కూడా అలాగే ఉంచుతుంది. ఈ మిశ్రమానికి కాస్త పసుపు కలిపితే పెదాలు పగలవు. దేశీ నెయ్యిని కూడా లిప్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు.