Beauty Tips: వింటర్లో డ్రై హెయిర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ నూనెలు మంచి పరిష్కారం చూపిస్తాయి!
Beauty Tips: సాధారణంగా చలికాలంలో జుట్టు పొడిబారి పోవడం సహజం. అలాంటప్పుడు ఆ జుట్టుని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయితే ఈ నూనెలు వాడితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు అంటున్నారు అది ఎలాగో చూద్దాం.
చలికాలంలో పొడి బారే జుట్టుతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొబ్బరి నూనె మీకు మంచి రెమిడీ. అయితే కొబ్బరి నూనెతో పాటు చాలా రకాల నూనెలు మీ జుట్టు డ్రైనేజ్ తగ్గటానికి అలాగే జుట్టు ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె సంవత్సరంలో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
చలికాలంలో గోరువెచ్చగా చేసి తనకు అప్లై చేసుకోవడం వలన మంచి రిజల్ట్స్ వస్తుంది. కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి నూనెలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె, అరటిపండు లేదా అవకాడో మిక్స్ చేసి తలకు పట్టించండి.
15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు కాంతివంతంగా ఉంటుంది. అలాగే చలికాలంలో జుట్టు సంరక్షణ కోసం ఆలివ్ నూనె కూడా బెస్ట్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ ని తయారు చేయటానికి కొంచెం ఆలివ్ ఆయిల్ గుడ్డు పచ్చ సొన మరియు తేనే కలపండి.
ఈ మిశ్రమాన్ని జుట్టు అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ హెయిర్ ప్యాక్ ని అలాగే ఉంచి ఆపై శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ ఉపయోగించడం వల్ల చివర్లు తేలిపోవడం జుట్టు రాలిపోవడం మరియు నిస్తేజంగా ఉండే జుట్టు కుదుళ్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అలాగే బృంగరాజ్ ఆయిల్ కూడా జుట్టుకి ఎంతో మంచిది.
ఈ నూనె నీ తలకి అప్లై చేయడం వలన చుండ్రు మరియు పొడి జుట్టుని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారించి జుట్టుకి తగినంత రక్తప్రసరణ పెంచుతుంది. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారకుండా నివారిస్తుంది. నువ్వుల నూనె కూడా జుట్టుకి చాలా మంచిది.
నువ్వుల నూనెలో ఉండే ఒమేగా త్రీ, సిక్స్ మరియు నైన్ ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. దీన్ని తలకి పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరింత మెరుగైన ఫలితం కోసం కొబ్బరి నూనెతో నువ్వుల నూనె మిక్స్ చేసి తలకు మసాజ్ చేయండి ఇది డ్రై హెయిర్ నుంచి మీకు విముక్తిని కలిగిస్తుంది.