alcohol: మందు తాగితే లివరే ఒక్కటే కాదు.. ఇవి కూడా దెబ్బతింటయ్ జాగ్రత్త..
alcohol: ఫ్రెండ్స్ అందరూ కలిసి సిట్టింగ్ లో పాల్గొని.. వేడి వేడిగా పకోడిలు లేదా బజ్జీలు లేదంటే మిక్చరో తెచ్చుకుని మందు కొడుతుంటే వచ్చే మజాయే వేరబ్బా అనుకుంటారు మందుబాబులు. కానీ మందు కొడితే.. లివర్ తో పాటుగా పెదవులు, అన్నవాహిక, నోరు, పెద్దపేగు వంటి క్యాన్సర్ల బారిన పడే అవకాశముందని అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వేలో తేలింది.

alcohol: మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అంటూ టీవీల్లో, సినిమా థియేటర్లలో యాడ్ ల మీద యాడ్ లు వస్తూనే ఉంటాయి. అంతెందుకు మందు బాటిల్ల మీద కూడా ఆ ముచ్చట ఉంటుంది. అయినా.. తాగేవారికి గవన్నీ ఏం పట్టవు. తాగామా..? కిక్కు ఎక్కిందా లేదా అనే చూస్తారు తప్ప. దానివల్ల మనకు ఏమవుతుంది. మన శరీరానికి ఏమౌతుంది వంటి విషయాలను అస్సలు పట్టించుకోరు.
మద్యం సేవించడం వల్ల మెదడు యాక్టీవ్ గా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అది మితంగా తాగితేనే. కానీ మందుకు బానిసలుగా మారిన వారికి రాత్రి పగలు అంటూ తేడా లేకుండా తాగుడు పనిలోనే ఉంటారు. ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అన్న సంగతి మనకు తెలుసు. దీన్ని ఓవర్ గా తాగితే లివర్ పాడవుతుందన్న ముచ్చట కూడా ఎరుకే. కానీ మందును అతిగా తాగితే ఎన్నో రకాల క్యాన్సర్లు సోకే అకాశం ఉందని కొత్త అధ్యయనం తేల్చి చెబుతోంది.
అంతర్జాతీయంగా నిర్వహించిన స్టడీ ప్రకారం.. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల Brain చురుగ్గా పనిచేయదట. Nerves కూడా దెబ్బతింటాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అంతేకాదు తరచుగా మందు కొట్టడం వల్ల Heart rate కూడా తగ్గిపోతుందట. ఇవే కాదు శ్వాసలో కూడా ఇబ్బంది తలెత్తుతుందట. ఇలా అయితే ఒక్కో సారి ప్రాణాలు కూడా పోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ తాగితే .. లివర్ కరాబవుతుందన్న ముచ్చటే మనకు తెలుసు. కానీ కొత్త స్టడీ ప్రకారం.. ఆల్కహాల్ మితిమీరి తాగడం వల్ల నోటి క్యాన్సర్, పేగు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, పెదవుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశముందని తేలింది. సిగరేట్ కాల్చడం వల్ల కూడా ఈ జబ్బుల బారిన పడతారట.
ఏటా 30 లక్షల మంది ఆల్కహాల్ తాగడం వల్లే చనిపోతున్నారు. అందులో 7, 40,000 మంది ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా క్యాన్సర్ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారట.
ఆల్కహాల్ తో పాటుగా స్మోకింగ్ చేసే వాళ్లలో మెటబాలిజం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వీరికి ఎన్నో రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇకకొంతమందికి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వస్తూ ఉంటుంది. దీనికి కారణం స్మోకింగ్ అలవాటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇకపోతే రా ఆల్కహాల్ తాగడం వల్ల కూడా చనిపోయే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయట. కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల స్థూలకాయం, నిద్రలేమి, అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. Central Department of Health Family Welfare రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి వెయ్యి మందికి పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయంట. కాబట్టి సిగరేట్, ఆల్కహాల్ తాగే అలవాటును వెంటనే మానుకోండి. లేదంటే విలువైన జీవితాన్ని కోల్పోయిన వారవుతారు.