Pension Scheme నెలకు 3000 పెన్షన్ కావాలా..? అయితే ఇలా చేయండి
వయసు మళ్లినవాళ్లకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం అనేక రకాల పింఛను పథకాలు ప్రారంభిస్తోంది. అందులో భాగంగా మోదీ సర్కార్ కొత్త యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ (UPS) తెస్తోంది. దీని కింద 60 ఏళ్ల తర్వాత నెలకు ₹3000 పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ కార్మికులు, సొంతంగా పనిచేసేవాళ్లు, వ్యాపారులు అందరికీ ఉపయోగపడుతుంది.

అందరికీ వర్తించే పథకం
కేంద్రంలో మళ్లీ గెలిచాక మోదీ సర్కార్ దేశ ప్రజల కోసం కొత్త బెనిఫిట్స్ తెచ్చింది. ఇప్పుడు అందరికీ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ (UPS) వస్తోంది. దీని గురించి శ్రమ శాఖ ఆల్రెడీ కసరత్తు చేస్తోంది.
ఏ భారతీయ పౌరుడైనా ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌ను EPFO కిందకు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ స్కీమ్ కార్మికులు, సొంతంగా పనిచేసేవాళ్లు, వ్యాపారులకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు.
60 ఏళ్ల తర్వాత నెలకు 3 వేలు వస్తాయి. దీనికోసం నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కట్టాలి. ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే ఇలాంటి పెన్షన్ స్కీమ్ వస్తుంది. దీని వల్ల దేశ ప్రజలకు లాభం జరుగుతుంది అంటున్నారు.
ఐక్యరాజ్యసమితి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం 2036 నాటికి ఇండియాలో వృద్ధుల సంఖ్య 15% అవుతుంది. అంటే వారి సంఖ్య దాదాపు 30 కోట్లకు చేరుతుంది.
2050లో ఇండియాలో వృద్ధుల సంఖ్య దేశం మొత్తం జనాభాలో 20% అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్లకి ఆసరాగా నిలవడానికి ఇండియాలో పెన్షన్ స్కీమ్ అమలు చేయడం గవర్నమెంట్ కు చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్, చైనా, కెనడా, రష్యా తదితర దేశాల్లో ఇలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి.