Hair Growth: బట్టతలపై జుట్టు మొలిపించొచ్చా?
ఈ రోజుల్లో జుట్టు రాలిపోయి బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందట. అదెలాగో తెలుసుకుందాం..

natural ways to regrow hair on bald head at home
Home Remedies for Bald Head: జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో చాలా మంది కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య. చిన్న వయసులోనే జుట్టు విపరీతంగా రాలిపోయి.. బట్టతల సమస్య వచ్చేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిన తర్వాత తలపై జుట్టు పెరగదు అని అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. కొన్ని రకాల హోం రెమిడీలు వాడితే మనం. మళ్లీ రాలిపోయిన జుట్టును మళ్లీ పెరిగేలా చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
ఉల్లిపాయ..
బట్టతల పై జుట్టు పెరగడానికి ఉపయోగించే అద్భుతమైన పదార్థం ఉల్లిపాయ. ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా, జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. దీని కోసం మీరు ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి స్నానం చేస్తే రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది. అలాగే ప్రతిరోజూ రెండు ఉల్లిపాయలను పచ్చిగా లేదా కూరలో కలిపి తినవచ్చు.
కరివేపాకు..
కరివేపాకు జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెరిగేలా చేస్తుంది. దీని కోసం బాగా ఎండిన కరివేపాకుతో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే నెల రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కొబ్బరి నూనె, ఆముదం..
2 స్పూన్ల కొబ్బరి నూనెలో, 1 స్పూన్ ఆముదం కలిపి కొద్దిగా వేడి చేసి తలకు పట్టించి మసాజ్ చేసి, తర్వాత టవల్‌తో తలను కప్పుకోండి. 5 నిమిషాలు అలాగే ఉంచి మళ్లీ మసాజ్ చేయాలి. ఈ పద్ధతిని మీరు 3 రోజులకు ఒకసారి చేస్తే నెత్తిమీద రక్త ప్రసరణ పెరిగి బట్టతల పడిన చోట జుట్టు పెరగడం మొదలవుతుంది.
fenu greek
మెంతులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇది జుట్టు వేగంగా పెరగడానికి, జుట్టు సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. దీని కోసం నానబెట్టిన మెంతులను పేస్ట్ లా చేసి అందులో విటమిన్ ఇ ఆయిల్ కలిపి, నెత్తికి పట్టించి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత స్నానం చేయాలి. దీన్ని మీరు వారానికి 2 సార్లు చేస్తే మీ బట్టతల మీద కూడా జుట్టు మొలకెత్తడం మొదలవుతుంది.
జుట్టు పెరగడానికి, బలంగా ఉండటానికి తగినంత ప్రోటీన్ అవసరం. దీని కోసం గుడ్డులోని పచ్చసొనలో కొద్దిగా నిమ్మరసం, ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి, కాసేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఈ పద్ధతిని మీరు వారానికి రెండుసార్లు చేస్తే చాలు. నెత్తికి కావలసిన పోషకాలు అందుతాయి, తల వెంట్రుకలు పెరగడానికి ప్రోత్సహించబడతాయి.
బట్టతల పై జుట్టు పెరగడానికి కొబ్బరి పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీని కోసం పావు కప్పు కొబ్బరి పాలలో 2 స్పూన్ల పెరుగు కలిపి మీ నెత్తికి పట్టించి తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో స్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే తల వెంట్రుకలు మళ్లీ పెరగడం మొదలవుతుంది.