Beauty Tips: కాంతివంతంగా మెరిసే ముఖం కోస.. అద్భుతమైన నాచురల్ ఫేస్ ప్యాక్స్!
Beauty Tips: కాలుష్య ప్రభావం వల్ల ముఖం కాంతి విహీనంగా ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవడం కోసం అందరూ కెమికల్ ఫేస్ ప్యాక్ వాడుతూ ఉంటారు. అయితే నేచురల్ గానే అలాంటి ఫేస్ ప్యాక్స్ఇం ట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
ముఖం అలసిపోవడం వల్ల కానీ, కాలుష్యం వల్ల కానీ కాంతి విహీనంగా అనిపించినప్పుడు వెంటనే కెమికల్ ఫేస్ ప్యాక్ లవైపు వెళ్ళకండి. మన వంటింట్లోనే అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి అవేంటో చూద్దాం. తేనె, బొప్పాయి మిశ్రమంతో అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
దీనికోసం ఒక గిన్నెలో నాలుగు బొప్పాయి ముక్కలు వేసి గుజ్జు చేసి దానికి రెండు టీ స్పూన్ తేనె కలపాలి ఈ మిశ్రమం కాస్త గట్టిగానే ఉండాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి అప్లై చేసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి తర్వాత వెచ్చని నీటితో తొలగించాలి.
తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తే, బొప్పాయి లోని ఎంజైమ్లు సహజ చర్మాన్ని తెల్లగా చేయడంలో హెల్ప్ అవుతాయి. అలాగే టమాటా గుజ్జును మెత్తగా చేసి దానికి రెండు మూడు టీ స్పూన్ల శనగపిండిని కలపాలి దీన్ని ముఖం మెడకు అప్లై చేయాలి.
ఇది తడి ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. దీనివలన మొఖం నిగారింపుతో మెరుస్తూ ఉంటుంది. అలాగే కుంకుమపువ్వు పాలు మిశ్రమం కూడా ముఖానికి మంచి ఫేస్ ప్యాక్. మూడు నాలుగు స్పూన్ల చల్లటి పాలలో రెండు మూడు కుంకుమ పువ్వులను యాడ్ చేసి అరగంటసేపు నానబెట్టాలి.
ఆ తరువాత ముఖానికి అప్లై చేసుకోవాలి. ఎండిపోయిన తర్వాత మళ్లీ దానిమీద మరో కోటింగ్ వేయాలి. తడి ఆరిపోయిన తర్వాత దానిని చల్లని నీటితో కడగాలి.
అలాగే రోజ్ వాటర్ చందనం యొక్క మిశ్రమంతో ఫేస్ ప్యాక్ పెట్టుకొని అరగంట పోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. రోజు వాటర్ స్కిన్ పీహెచ్ స్థాయిలని బ్యాలెన్స్ చేస్తుంది. చందనం చర్మం యొక్క రంగుని మెరిసే లాగా చేస్తుంది.