సక్సెస్ సాధించిన పురుషుల అలవాట్లు ఇలానే ఉంటాయి..!
ఉదయాన్నే ఏదైనా పుస్తకం రెండు పేజీలు చదువుతారట. మీకు ప్రేరణ కలుగుతుంది అనుకున్న ఏదైనా ఒక దానిని మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఇది చాలా మంచి అలవాటు.

మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి కొన్ని గంటలు చాలా కీలకం. మీరు దానిని ఎలా ఖర్చు చేస్తారు చాలా ముఖ్యం. ఆ కొద్ది గంటలు.. మీ రోజు మొత్తం ఎలా గడుస్తుంది అనేది ఆధారపడుతుంది. కాబట్టి.. ఉదయాన్నే కొన్ని మంచి అలవాట్లను ఫాలో అవ్వాలట. జీవితంలో విజయం సాధించిన చాలా మంది పురుషులకు మార్నింగ్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయట. అవి కూడా వారి విజయానికి ఒక కారణం కావచ్చు. మరి ఆ అలవాట్లు ఏంటో ఓసారి చూద్దామా..
reading
చాలా మంది పురుషులు ముఖ్యంగా జీవితంలో సక్సెస్ సాధించిన వారు ఉదయం లేవగానే ఒక నిర్దిష్ట ఆచారాన్ని అనుసరిస్తారట. అంటే.. కొందరు మంచి ప్రేరణ కల్పించే పాటలను వింటారట. లేదంటే.. ఉదయాన్నే ఏదైనా పుస్తకం రెండు పేజీలు చదువుతారట. మీకు ప్రేరణ కలుగుతుంది అనుకున్న ఏదైనా ఒక దానిని మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఇది చాలా మంచి అలవాటు.
మీరు బరువులు ఎత్తడం , కండరాలను పెంచుకోవడంలో ఆసక్తి చూపకపోయినా, ఉదయం వ్యాయామం చేయడం మీ శారీరక , మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. కొన్ని కిలోమీటర్లు రన్నింగ్ చేయడం లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల మీరు రోజంతా పూర్తిగా రిఫ్రెష్‌గా , యాక్టివ్‌గా ఉంటారు.
మిమ్మల్ని , మీ సన్నిహితులను ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనను పఠించడం ఒక గొప్ప ఉదయం అలవాటు. కృతజ్ఞతా భావాన్ని ఆచరించడం వల్ల ఎదుటివారు ఎంత కఠినాత్ములైనా మీరు వినయంగా , శ్రద్ధగా ఉండగలుగుతారు. మీ జీవితంలో మీకు లభించే చిన్న చిన్న సంతోషాల కోసం కృతజ్ఞతతో ఉండండి. కాబట్టి.., ఈ అలవాటు నేర్చుకోవడం చాలా అవసరం.
men infertility
మీరు మీ రోజును ప్రారంభించడానికి ముందు.. మీకు వీలైనన్ని పాజిటివ్ కోట్స్ చదవండి. మీకు నిజంగా కావాలంటే ఏదైనా మానిఫెస్ట్ చేయండి. రోజు ప్రారంభించడానికి ముందు మీ రోజులో 5 నిమిషాలు తీసుకోండి. మీరు ప్రేరణ గురించిన ప్రసిద్ధ వ్యక్తుల నుండి సానుకూల కోట్‌లను కూడా చదవవచ్చు.
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. ప్రోటీన్, విటమిన్లు , మినరల్స్‌తో సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన, పోషకాలున్న అల్పాహార్నాన్ని తీసుకోండి. ఎక్కువగా పండ్లు తీసుకోవడం ఉత్తమ మార్గం. స్మూతీస్ కూడా ఉదయం త్రాగడానికి ఒక గొప్ప ఎంపిక, ఎందుకంటే ఇందులో కూరగాయలు, పండ్ల మిశ్రమం ఉంటుంది.