Acidity: మార్నింగ్ చేసే ఈ పొరపాట్ల వల్లే మీకు ఎసిడిటీ వస్తుంది..
Acidity: ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఎసిడిటీ రావడానికి మీరు ప్రతిరోజూ ఉదయం చేసే ఈ తప్పులే కారణం.

Acidity: కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్య వల్ల రోజు వారి పనులను కూడా చేసుకోలేకపోతుంటారు. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి అసలు కారణం. అందుకే ఆరోగ్యాన్ని నాశనం చేసే, ఎసిడిటీకి కారణమయ్యే ఆహారపు అలవాట్లను తొందరగా మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
acidity
ఉదయాన్నే ఈ తప్పులు మాత్రం చేయకండి.. నిద్రలేవగానే టీ తాగే అలవాటుందా.? అయితే వెంటనే ఆ అలవాటును మానుకుంటే మంచిది. ఎందుకంటే పరిగడుపున టీ తాగితే ఎసిడిటీ, రిఫ్లక్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఖాళీ కడుపుతో టీ తాగితే పిత్తరసంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది ఎసిడిటీతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
మార్నింగ్ టీతో పాటుగా ఇంకొన్ని విషయాలను కూడా గుర్తించువాలి.. ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అందులో వేడి వేడి కాఫీ, మసాలా ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, చాక్లెట్స్ వంటివి తినకూడదు. వీటిని తింటే ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఎసిడిటీని నివారించాలంటే ఇలా చేయండి.. ఉదయం టీ లేకుండా నేనుండలేను అనుకునే వారు టీ కి బదులుగా అల్లంటీని తాగండి. ఇది మీ ఎసిడిటీ సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
ప్రతిరోజూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకోండి. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడదు. అలాగే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయం పూట ఉడకబెట్టిన గుడ్లను తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటంతో పాటుగా పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి.
గ్రీన్ వెజిటేబుల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తక్కువ నూనెలో వేయించిన గ్రీన్ వెజిటేబుల్స్ ను తీసుకుంటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఎసిడిటీ సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు వాకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కూడా.