ఈ నూనె పెడితే నెత్తిమీద చుండ్రు ఉండదు. వెంట్రుకలు రాలవు
మునగాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని చాలా మంది తింటారు. అయితే దీనితో నూనె తయారుచేసి పెట్టుకుంటే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇంతకీ ఈ నూనెను ఎలా తయారుచేయాలంటే?
ఈ మధ్య మునగాకు చాలా ప్రత్యేకంగా మారిపోయింది. దీనిని తినడమే కాకుండా.. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వాడుతారు. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని కాపాడటానికి, జుట్టును హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి.
మీకు తెలుసా? మునగాకును ఉపయోగించి మనం ఎన్నో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దీనితో తయారుచేసిన నూనెను వాడితే జుట్టుకు సంబంధించిన సమస్యలే రావు. ఈ నూనె మన నెత్తిని చల్లగా ఉంచి, మంచి పోషణను అందిస్తుంది. ఇది జుట్టును బలంగా చేయడానికి, చుండ్రును తగ్గించడానికి, వెంట్రుకలను నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అసలు ఈ మునగాకు నూనెను జుట్టుకు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టుకు మునగాకు నూనె ప్రయోజనాలు
బలమైన జుట్టు
మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ ప్రోటీన్ తో తయారవుతుంది. కానీ కెరాటిన్ ఉత్పత్తి వయసుతో పాటుగా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా అవుతుంది. అలాగే వెంట్రుకలు డ్రై అవుతాయి. జుట్టు తెగిపోతుంది. సన్నబడుతుంది. వెంట్రుకలు బాగా రాలుతాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ తగ్గించడానికి మునగాకు నూనె ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనె కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే వృద్ధాప్య లోపాన్ని కూడా భర్తీ చేస్తుంది.
మునగాకు నూనెలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన నెత్తికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మన జుట్టును కాలుష్యం, వేడి నుంచి కాపాడుతుంది. జుట్టు బలంగా, హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది.
మెరిసే జుట్టు
మునగాకు నూనెలో బెహెనిక్ ఆమ్లంతో పాటుగా కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి మన జుట్టును ప్రశావంతంగా, సిల్కీగా చేస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాలు ప్రతి వెంట్రుకకు పోషణను అందిస్తాయి. అలాగే అదనపు తేమ రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
జుట్టుకు తేమ
మునగాకు నూనె నెత్తికి మంచి తేమను అందిస్తుంది. ఇది జుట్టు పెరగడానికి చాలా అవసరం. మునగాకు నూనె పెడితే జుట్టు మూలాల నుంచి పొడిబారడం తగ్గుతుంది. అలాగే లోతైన పోషణను అందిస్తుంది.
hair oiling
మునగాకు నూనెను ఎలా ఉపయోగించాలి?
జుట్టుకు మునగాకు నూనె ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం ఈ నూనెనె నెట్టి నెత్తిమీద కాసేపు మసాజ్ చేయండి. అలాగే దీన్ని హెయిర్ మాస్క్ గా కూడా ఉపయోగించొచ్చు. దీన్ని ఏ విధంగా ఉపయోగించినా జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.