- Home
- Life
- Lunar Eclipse 2022: భారత దేశంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం.. ఫుల్ డీటెల్స్ ఇవిగో..
Lunar Eclipse 2022: భారత దేశంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం.. ఫుల్ డీటెల్స్ ఇవిగో..
Lunar Eclipse 2022: మన దేశంలో ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో మొదటిది మే 16 న ఏర్పడగా.. రెండో నవంబర్ 2 ఏర్పడనుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

ఈ సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం ఈ వారాంతంలోనే ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు లోతైన, ఎరుపు రంగులోకి మారతాడు, అందువల్ల దీనికి ‘బ్లడ్ మూన్ చంద్ర గ్రహణం ’అని కూడా పేరుంది. వాతావరణ పరిస్థితులు స్పష్టంగా ఉంటే, యుకే అంతటా ప్రజలు బ్లడ్ మూన్ చంద్ర గ్రహణం 2022 ను చూడవచ్చు.
సూర్యుడు, భూమి మరియు చంద్రుడు సమ లేఖనంలో ఉన్నప్పుడు పౌర్ణమి రాత్రి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భూమి సూర్యుడు, చంద్రుడు రెండింటి మధ్యకు వస్తుంది.
2022లో బ్లడ్ మూన్ చంద్ర గ్రహణం మే 16, 2022న తెల్లవారుజామున 2:32 నుంచి 05:11 గంటల మధ్య యూకే వ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ గ్రహణం అని పిలువబడే గ్రహణం యొక్క మొదటి భాగం ఉదయం 2:32 గంటలకు ప్రారంభం కానుండగా.. పాక్షిక గ్రహణం అని పిలువబడే రెండవ భాగం ఉదయం 3:27 గంటలకు ప్రారంభమవుతుంది. తదుపరి లేదా చివరి భాగం పూర్తి గ్రహణం ఉదయం 4:29 గంటలకు ప్రారంభమవుతుంది.
మన దేశంలో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది.. ఈ మే 16 న చంద్రగ్రహణం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12: 20 గంటలకు ముగుస్తుంది. చంద్రుడు భూమి నీడ గుండా వెళ్లినప్పుడు.. ఈ ఖగోళ సంఘటన సంభవిస్తుంది.
2022 సంవత్సరంలో చంద్రగ్రహణం.. 2022 లో రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం 2022 మే 16 ఏర్పడనుండగా రెండో చంద్రగ్రహణం 2022 నవంబర్ 2 న ఏర్పడనుంది.
Lunar Eclipse 2022
భారతదేశంలో విజిబిలిటీ? ఏడాదిలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించడదు. ఇది దక్షిణ అమెరికా , ఉత్తర అమెరికా తూర్పూ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.
మే 16 చంద్రగ్రహణాన్ని ఎలా చూడాలి.. మే 16 న భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించకపోయినప్పటికీ stargazers నాసా యొక్క సోషలల్ మీడియా సైట్లో దీనిని ప్రత్యక్షంగా చూడవచ్చు. అలాగే ఈ చంద్రగ్రహణాన్ని చూడటానికి నాసా అధికారికి వెబ్ సైట్లు లేదా సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు.