- Home
- Life
- Love or Arranged Marriage ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిందా? మీ పుట్టిన తేదీనే నిర్ణయిస్తుంది!
Love or Arranged Marriage ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిందా? మీ పుట్టిన తేదీనే నిర్ణయిస్తుంది!
పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలకు తమ పెళ్లి, భవిష్యత్తుపై ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. కానీ వాళ్లు ఎలా ఊహించుకున్నా.. జ్యోతిష్య, సాంఖ్యా శాస్త్రం ప్రకారం.. పుట్టిన తేదీ ఆధారంగానే ఎవరు ప్రేమ పెళ్లి, ఎవరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారో ముందే నిర్ణయం జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

పెళ్లి జీవితం: ప్రతి ఒక్కరి చేతిలో ఒక వివాహ రేఖ ఉంటుంది. అది ప్రేమ-వివాహం గురించి చెబుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ వివాహం అవుతుంది? ఎవరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి అవుతుంది? అన్నీ తెలుసుకోవచ్చు (Love Marriage or Arrange Marriage).
1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్లు ప్రేమలో పడతారు. కానీ అది వన్ సైడ్ లవ్. తమ ప్రేమను ప్రేమించిన వాళ్లతో వ్యక్తం చేయలేరు. అందుకే వాళ్లకు ప్రేమ పెళ్లిళ్లు అయ్యే అవకాశం తక్కువ.
2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వాళ్లు ప్రేమ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలి అనే పట్టుదలతో ఉంటారు. కానీ కొన్ని ఇబ్బందులు పొంచి ఉంటాయి. కాబట్టి ప్రేమలో చాలా జాగ్రత్తగా అడుగు వెయ్యాలి. వీళ్లకు ప్రేమ వివాహం అయ్యే అవకాశం చాలా ఎక్కువ (Love Marriage or Arrange Marriage Prediction Calculator).
4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా.. తొలిచూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. ఒకసారి ఈ రిలేషన్ మొదలైతే, అది పెళ్లి వరకు ఖచ్చితంగా వెళ్తుంది.
5వ తేదీన పుట్టిన వాళ్లు: 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్లు కాస్త మొండిగా ఉంటారు. వీళ్లు ప్రేమలో తమ తప్పును అస్సలు ఒప్పుకోరు. అంతేకాదు, వీళ్లు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీళ్లకు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఎక్కువ. (Love Marriage or Arrange Marriage by date of birth).
6వ తేదీన పుట్టిన వాళ్లు: 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్లు భాగస్వామిని ఎంచుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతారు. కానీ, వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. చేసుకుంటారు కూడా.
7, 16, 25 తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా బిడియస్తులు. ప్రేమలో పడ్డా, దాన్ని పెళ్లి పీటలు ఎక్కించే ధైర్యం తక్కువ. వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్లకు సదభిప్రాయం ఉండదు. ప్రేమలో పడ్డా.. దాన్ని పెళ్లి వరకూ తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేయరు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు.
9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్లకు పనే ప్రపంచం. ప్రేమ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ తమ పనిలో బిజీగా ఉంటారు. ప్రేమ, పెళ్లికి సమయం కేటాయించడమే వ్యర్థం అనుకుంటారు. వీళ్లు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు.