జాగ్రత్త.. అసురక్షిత సెక్స్ తో కూడా కాలేయం దెబ్బతింటుంది
ఆల్కహాల్ ను మితిమీరి తాగిన వారితో పాటుగా జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకున్నా.. ఉప్పును మోతాదుకు మించి వాడినా కాలెయం దెబ్బతింటుందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే అసురక్షిత సెక్స్ వల్ల కూడా కాలెయం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మానవ శరీరంలో కాలెయం ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. కానీ కొంతమంది ఆల్కహాల్ ను మితిమీరి తాగుతూ వారి చేతులారా కాలెయాన్ని దెబ్బతీస్తున్నారు. అయితే ఆల్కహాల్ ఒక్కటే కాదు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఉప్పు మొదలైనవి కూడా కాలెయాన్ని దెబ్బతీస్తాయి.
LIVER
కాలెయం దెబ్బతిన్నప్పుడు మన శరీరంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, అలసట, వాంతులు, శరీర బలహీనత, నిద్రలేమి, వేగంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం... దేశంలో చాలా మంది మరణానికి కాలెయ సంబంధిత వ్యాధి అత్యంత పదవ సాధారణ కారణంగా గుర్తించారు. ప్రతి ఏడాది కాలెయ సిర్రోసిస్ తో సుమారుగా 10 లక్షల మంది భారతీయులు బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీన్ని ప్రపంచ మరణాల ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తించారు.
పలు అధ్యయనాల ప్రకారం.. మితిమీరిన మందుల వాడకం కూడా కాలెయం దెబ్బతినడానికి దారితీస్తుంది. మందులు, సప్లిమెంట్లు, మూలికలను ఎక్కువగా తినేవారి కాలెయం చాలా తొందరగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి చిన్న జబ్బుకు ట్యాబ్లెట్లను వాడటం వల్ల కాలెయ వైఫల్యం, కాలెయ సంక్రమణ వ్యాధులు వస్తాయి.
నీళ్లను ఎక్కువగా తాగాలి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసులను నీటిని ఖచ్చితంగా తాగాలి. దాహం వేసినా.. వేయకపోయినా నీటిని మాత్రం తాగాలని నిపుణులు సలహానిస్తున్నారు. దీనివల్ల కాలెయ ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే కాలెయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
నిద్రలేమి
నిద్రలేమి కూడా కాలెయంపై చెడు ప్రభావం చూపెడుతుంది. నిద్రలేమి, ఆక్సీకరణ ఒత్తిడితో బాధపడేవారు గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
smoking
స్మోకింగ్
ఆల్కహాల్ తో పాటుగా సిగరేట్ కూడా కాలెయాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే సిగరేట్ లో విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి కాలెయాన్ని ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేస్తాయి. అంతేకాదు ఇవి కాలెయ ఫ్రీ రాడికల్స్ ను కూడా ఉత్పత్తి చేస్తాయి. దీంతో కాలెయ కణాలు దెబ్బతింటాయి.
ప్యాక్ చేయబడ్డ ఆహారాలు
ఒక అధ్యయనం ప్రకారం.. ప్యాక్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటే కాలెయం దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ ఫుడ్స్ లలో ప్రిజర్వేటివ్స్, సంకలనాలు, ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు దీనిలో శరీరానికి హానిచేసే రసాయనాలు సైతం ఉంటాయి. ఈ ఆహారాలను విచ్చిన్నం చేయడం కాలెయానికి కష్టంగా మారుతుంది.
అసురక్షిత సెక్స్ (Unprotected sex)
చాలా మంది వ్యక్తులతో అసురక్షితమైన సెక్స్ ను కలిగి ఉంటే కూడా కాలెయ ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ఎక్కువగా హెపటైటిస్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. హెపటైటిస్ అనేది లైంగికంగా సంక్రమించే ప్రాణాంతక కాలెయ వ్యాధి.