కలలో పక్షులు వస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా?
మనిషి జీవితంలో నిద్రించే సమయంలో కలలు (Dreams) రావడం సర్వసాధారణం. అయితే వీటిలో మంచి కలలు, భయాన్ని కలిగించే చెడు కలలు ఉంటాయి. నిద్రించేటప్పుడు వచ్చే కలలు మనసును ప్రభావితం చేస్తాయి. ఇలా మంచి కలలు వచ్చినప్పుడు ఉదయాన్నే ఉత్సాహంగా కనిపిస్తాము. అదే చెడు కలలు వచ్చినప్పుడు ఉదయం మనసుకు తెలియని ఆందోళన, భయం ఏర్పడుతుంది. చెడు కలల కారణంగా ఆ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ ఏమవుతుందో అన్న భయం వారిలో కనిపిస్తుంది. కలలో మనకు జంతువులు, పక్షులు, మనుషులు ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం కలలో పక్షులు (Birds) కనిపిస్తే వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

అయితే మనం రోజులో ఏ విషయం గురించి అయితే అదేపనిగా ఎక్కువగా ఆలోచిస్తూంటామో (Thinking) అందుకు సంబంధించిన కలలు రావడం సర్వసాధారణం. అయితే మనం ఆలోచించే వాటికి సంబంధం లేకుండా వచ్చే కలలు అదికూడా తెల్లవారుజామున (At dawn) వచ్చే కలలు మాత్రమే నిజమవుతాయని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా కలలో ఎత్తయిన శిఖరాలు, కొండలు, జలపాతాలు, జంతువులు పక్షులు ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి.
ఇవన్నీ కూడా కలలో కనిపించిన తీరును బట్టి వాటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఒక్కొక్కటి ఒక్కో ప్రభావాన్ని (Effect) కలిగిస్తాయి. అయితే ఇప్పుడు పక్షుల విషయానికి వస్తే కొన్ని పక్షులు కనిపించినపుడు మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. అదే మరి కొన్ని పక్షులు కనిపించడంతో అనేక సమస్యలు (Problems) ఎదురవుతాయి. అయితే ఇప్పుడు మనం ఏ పక్షులు కనిపిస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
రామచిలుకలు (Parrots) కలలో కనిపిస్తే వారికి వ్యాపార రంగాలలో మంచి గుర్తింపు, గౌరవం అందుతుంది. ఆకస్మిక ధనలాభం (Monetary gain) కలుగుతుంది. ఏ వ్యాపార రంగం వారికైనా అందులో అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయి. కనుక కలలో రామచిలుకలు కనిపిస్తే మంచిదే.
పిచ్చుకలు (Sparrows) ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తే వారి అన్ని కష్టాలు తొలగిపోయి అదృష్టం (Good luck) వరిస్తుంది. కుటుంబంలో ఆనందాలు నెలకొంటాయి. వారికి అంతా మంచే జరుగుతుంది. కనుక కలలో పిచ్చుకలు కనిపిస్తే దిగులు చెందకండి ఇది శుభ సంకేతమే.
కలలో నెమలి (Peacock) కనిపిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. ఆ కుటుంబంలో వివాహాన్ని, రాబోయే సంతానాన్ని సూచిస్తుంది. అదే కొంగలు కనిపిస్తే మానసిక రుగ్మతలు (Mental disorders) తొలగిపోయి ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తారు.
గరుడ పక్షి (Garuda bird) కనిపిస్తే ఆరంభించిన అన్ని పనులలో విజయం (Success) ప్రాప్తిస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కనుక గరుడ పక్షి కూడా శుభ సంకేతమే. కానీ కలలో కాకి కనిపిస్తే మాత్రం వారికి కష్టాలు మొదలవుతాయని గ్రహించాలి.
కాకి (Crow) కనిపిస్తే ఏ పని చేపట్టినా కాస్త జాగ్రత్త వహించడం (Be careful) తప్పనిసరి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీటి నుంచి విముక్తి కలగడానికి దైవారాధన చేయడం మంచిది.