కేవలం 21 నిమిషాలు నడిస్తే.. ఒక్క గుండె జబ్బులేంటీ.. ఎన్నో రోగాలు తగ్గిపోతాయి తెలుసా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 17.9 మిలియన్ల మరణాలకు గుండెజబ్బులే కారణమవుతున్నాయట.

ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేధిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం అవుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఏడాది గుండె జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా 17.9 మిలియన్ల ప్రజలు చనిపోతున్నారట.
శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొగాకు వాడకం, ఆల్కహాల్ వంటి అలవాట్ల కారణంగా స్ట్రోక్, గుండెపోటు, గుండె జబ్బులు వస్తున్నాయని గ్లోబల్ ఏసెన్సీ తెలుపుతోంది.
walking
శుభవార్త ఏమిటంటే గుండె జబ్బులు నడక ద్వారా తగ్గుతాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రెండే రెండు నిమిషాల నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించిందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
walking
హార్వర్డ్ మెడికల్ స్కూల్ సమీక్ష ప్రకారం.. ప్రతి రోజూ 21 నిమిషాల పాటు నడవడం వల్ల 30 శాతం గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. అంటే ఒక వారంలో రెండున్న గంటలు నడవాలన్న మాట. ఈ సమీక్ష ప్రకారం.. అధిక రక్తపోటు, అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ నడక మెమోరీ పవర్ ను కూడా పెంచుతుంది. అలాగే క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తన సమీక్షలో పేర్కొంది.
walking
గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమ వ్యాయామాల్లో ఒకటని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొండి. నడకతో శరీరానికి శక్తి లభించడమే కాదు.. అధిక రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా వేగంగా తగ్గిపోతుంది.
ముఖ్యంగా ఈ నడక కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి.
నడక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి గుండె జబ్బుల ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. నడక నిరాశను తగ్గించడంలో మెడిసిన్స్ లా పనిచేస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తన సమీక్షలో పేర్కొంది. అంతేకాదు నడక పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
క్రమం తప్పకుండా నడవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గడంతో పాటుగా గుండె కూడా ఫిట్ గా ఉంటుందట. నడక కండరాలను, ఎముకలను బలోపేతం చేస్తుంది. శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
US Centers for Disease Control and Prevention (CDC)గుండె ఆరోగ్యానికి తాజా పండ్లను, కూరగాయలను, ప్రోటీన్ పుడ్ ను, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవాలని చెబుతోంది. ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు గుండె జబ్బులకు దారితీస్తాయని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
అలాగే ఆల్కహాల్ ను మోతాదుకు మించి తాగకూడదు. స్మోకింగ్ అలవాటును పూర్తిగా మానుకోవాలి. అప్పుడే గుండె జబ్బులు రావు.