Sleep Deprivation: వీటిని తింటే.. ఎంత హాయిగా నిద్రపోతారో..!
Sleep Deprivation: ప్రస్తుత కాలంలో పెద్ద వయసు వారి నుంచి మొదలు పెడితే.. యువత కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే అసలు రాత్రుళ్లు మెలుకువే రాదు తెలుసా..?

మనిషికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రతోనే శరీరం శక్తివంతంగా మారుతుంది. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఒకవేళ నిద్రసరిగ్గా పోకుంటే.. మీ మొత్తం ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. నిద్ర లేమి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. నిద్ర శారీరక ఆరోగ్యంపైనే కాదు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
ప్రస్తుతం నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లాక్డౌన్ కాలం నుంచే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ Nutritionist లవ్నీత్ బాత్రా నిద్ర సమస్యలతో బాధపడేవారికి చక్కటి పరిష్కార మార్గాలను సూచించారు. ఈ ఆహారాలను తింటే హాయిగా నిద్రపడుతుందని చెప్పారు. అవేంటంటే..
ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య పురుషుల్లో కాదు.. మహిళల్లో కూడా కనిపిస్తోంది. లవ్నీత్ బాత్రా ప్రకారం.. మహిళల్లోనే నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డైట్ టిప్స్ నిద్ర సమస్యలను పరిష్కరిస్తాయని చెబుతున్నారు.
అశ్వగంధ (Ashwagandha): అశ్వగంధ గురించి తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం.. అశ్వగంధ అనేక అనారోగ్య సమస్యలకు నివారణగా సూచించబడింది. ఇది నిద్ర సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధలో ఉండే 'Vithanolides' ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అశ్వగంధలో ఉండే 'Triethylene glycol' నిద్రను పెంచడంలో సహాయపడుతుంది.
చామంతి టీ (Chamomile tea): చామంతి టీ లో ఎన్నో ఔషద గుణాటుంటాయి. ఇవి మంచి నిద్రకు ఎంతో సహాయపడతాయి. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయి. ఈ టీ నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో లభిస్తుంది. దీన్ని వేడి నీటిలో వేసి తాగొచ్చు.
బాదం (Almonds): నట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వీటిలో బాదం పప్పులు నిద్రపోవడానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు (Pumpkin seeds): గుమ్మడి కాయ విత్తనాలు లేదా గుమ్మడి గింజలు మార్కెట్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి నిద్రలేమి సమస్యకు చెక్ పెడతాయి. ఇందులో 'ట్రిప్టోఫాన్', జింక్ ఉంటాయి. ఇవి నిద్రకు సహకరిస్తాయి.
జాజికాయ పాలు (Nutmeg milk): జాజికాయ పాలు తాగడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం గ్లాస్ పాలలో కొద్దిగా జాజి పొడిని మిక్స్ చేసి తాగాలి.