MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల మొటిమలు అయ్యాయా? తగ్గాలంటే ఇలా చేయండి

మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల మొటిమలు అయ్యాయా? తగ్గాలంటే ఇలా చేయండి

ఒక ఎండాకాలంలో తప్ప మరే సీజన్ లో మామిడి పండ్లు దొరకవు. మామిడి పండ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఈ పండ్లను అతిగా తింటే ఒంట్లో వేడి పెరుగుతుంది. మొటిమలు కూడా అవుతాయి. ఈ మొటిమలను తగ్గించుకోవాలంటే? 

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 15 2023, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image: Getty

Image: Getty

ఎండాకాలంలో ఎక్కువగా తినే పండు మామిడి. నిజానికి ఈ మామిడి పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కొంతమందికి మామిడి పండును ఎక్కువగా తిన్న తర్వాత మొటిమలు అవుతుంటాయి. 
 

27


మామిడి పండ్లు తిన్న తర్వాత మొటిమలు ఎందుకు వస్తాయి?

మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ ఇ, బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మామిడిలో గ్లూకోజ్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. మామిడి సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది థర్మోజెనిసిస్ కు కారణమవుతుంది. ఇందులో ఫైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఫైటిక్ ఆమ్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది విటమిన్లు, ఖనిజాల శోషణకు కూడా ఆటంకం కలిగిస్తుంది. ఫైటిక్ యాసిడ్ ప్రభావాన్ని తగ్గించడానికి మాత్రమే మామిడి పండ్లను నీటిలో ముంచుతారు.
 

37
acne spots

acne spots

మామిడి వల్ల అయ్యే మొటిమలను ఎలా నివారించాలి?

ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ ప్రకారం.. మామిడి పండ్లను తిన్న తర్వాత మొటిమలను నివారించాలనుకుంటే.. కొన్ని శతాబ్దాల నాటి భారతీయ ఆయుర్వేద పద్ధతిని అనుసరించాలి. వీటిని తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. మామిడి పండ్లను 3-4 గంటలు నీటిలో నానబెట్టడం వల్ల మామిడి పండులోని వేడి అంటే ఫైటిక్ ఆమ్లం ప్రభావం తొలగిపోతుంది. మామిడి పండు వల్ల అయిన మొటిమలను తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

47

సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్

సాలిసిలిక్ ఆమ్లం స్కిన్ ఎక్స్ఫోలియేటర్. ఇది అదనపు నూనెను తొలగిస్తుంది. అలాగే మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తుంది.  ఫ్యూచర్ లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రాకుండా కూడా చూస్తుంది. ఖనిజాలు, సాలిసిలిక్ ఆమ్లం మెంతోల్ ఎక్కువగా ఉండే ఫేస్ వాష్ ఉపయోగించండి. ఇది లోపలి నుంచి రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఇది మీకు శుభ్రమైన, చల్లని, రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.
 

57

మొటిమలను గిచ్చొద్దు

మొటిమలను గిచ్చడం వల్ల అవి మరింత ఎక్కువ అవుతాయి. ఇవి దురదగా అనిపిస్తే కాటన్ తో తేలికగా తాకండి. మీరు నీళ్లను ఎక్కువగా తాగాలి. వాటర్ శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. గాయాలు నయమయ్యే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్యూరిఫైయింగ్ సీరంతో చర్మాన్ని తేమగా, మొటిమలు లేకుండా ఉంచండి. ఇందుకోసం సి మినరల్స్, సాలిసిలిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ ను వాడాలి.
 

67
acne

acne

చెమట, నూనె నుంచి చర్మాన్ని రక్షించండి

చర్మంపై చెమట లేదా సెబమ్ పేరుకుపోయినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. క్రమం తప్పకుండా ఎక్స్ఫోలియేటింగ్ చేయడం వల్ల ముఖం శుభ్రంగా, చెమట లేకుండా ఉంటుంది. రంధ్రాలు మూసుకుపోకుండా ఉండేందుకు, ధూళి,  కాలుష్య కారకాలను తొలగించే బొగ్గు బంకమట్టిని ఉపయోగించండి.

77

మామిడి పండ్లను చిన్న ముక్కలుగా తినండి

న్యూట్రిషన్ జర్నల్ ప్రకార.. మామిడి పండ్లంటే ఎంత ఇష్టమున్నా సరే వీటిని ఎక్కువగా తినకండి. ఎందుకంటే అధిక గ్లూకోజ్ స్థాయిలు చర్మ సమస్యలను పెంచుతాయి. అంతేకాదు పాల ఉత్పత్తులు, వేయించిన, అల్ట్రాప్రాసెస్డ్ ఆహారాలు, తీపి, కేలరీలు ఎక్కువగా ఆహారాలు, పానీయాలను తీసుకున్నా మీ చర్మం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇది మొటిమలకు దారితీస్తుంది. మామిడి పండ్లను మితంగా తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఫుడ్స్ తిన్నారంటే మత్తుగా నిద్రపట్టేస్తుంది
Recommended image2
డైప‌ర్ వాడితే పిల్ల‌ల కిడ్నీలు దెబ్బ‌తింటాయా.? ఇందులో నిజ‌మెంత‌..
Recommended image3
రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved