మూత్రం రంగు మారిందో.. మీ పని అంతే ఇక..
ఒక్క మూత్రం రంగు చాలు మీరు ప్రమాదపు అంచున్న ఉన్నారనడానికి . అవును.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రం రంగులో మార్పులు కన్పిస్తే మీరు డేంజర్ జోన్ లో ఉన్నారని అర్థమట.

ఒక్క మూత్రం రంగుతోనే మీకు ఏ వ్యాధి సోకిందో చెప్పొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును ఇది మీరు నమ్మకపోయినా.. ఇదే నిజమంటున్నాయి కొన్ని పరిశోధనలు. మన శరీరంలో జరిగే ఎన్నో మార్పుల ప్రభావంతోనే మూత్రం రంగు మారిపోతుంది.
అంతేకాదు ఈ రంగు మన శరీరంలో ఏయే సమస్యల బారిన పడిందో కూడా తెలియజేస్తుంది. అందుకే మూత్రం రంగును గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది.
కొన్ని నివేదికల ప్రకారం.. మన శరీరంలో వ్యాదులు పెరిగిపోయిందనడానికి గుర్తుగా మన మూత్రం ముదురు రంగులో వస్తుందట. అయితే మరో కారణం వల్ల కూడా మూత్రం ముదురు రంగులో వస్తుంది. మూత్రంలోని యూరోక్రోమ్ అనే రసాయనం కారణం వల్ల మూత్రం ముదురు రంగులో వస్తుంది.
కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల కూడా మూత్రం రంగులో మార్పు వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మూత్రం సాధారణ రంగులో వస్తే మీరు నీళ్లను ఎక్కువగా తాగుతున్నట్టు. బాడీ హైడ్రేటెడ్ గా ఉండటం మంచిదే కానీ.. నీళ్లను మరీ ఎక్కువగా తాగితే కూడా Electrolyte లు మన శరీరంలో తగ్గిపోతాయి.
ఇకపోతే మీ మూత్రం రంగుTransparent కనిపించినట్టైతే మీరు నీటిని తక్కువగా తాగాలని అర్థం. మన బాడీలో ఉండే Eurochrome pigments వల్ల కూడా మూత్రం లైట్ ఎల్లో కలర్ నుంచి డార్క్ ఎల్లో కలర్ లోకి మారిపోతుంది. అప్పుడు మీరు నీళ్లు ఎక్కువగా తాగితే ఆ రంగు Transparent గా అయితది.
అయితే ఈ యూరోక్రోమ్ మన శరీరంలో హిమోగ్లోబిన్ విచ్చిన్నం అయితే కూడా ఏర్పడుతుంది. కాగా మన రక్తంలో విటమిన్ డి ఎక్కువతై కూడా మూత్రం Dark yellow రంగులోకి మారిపోతుంది.
మీ మూత్రం Pink లేదా ఎరుపు రంగులో వస్తే మీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. మూత్రం రంగు మారడానికి మీరు తినే ఆహారం కూడా ఒక కారణం కావొచ్చు. అయితే చాలా కాలం నుంచి మీ మూత్రం రంగు ఉండే మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
మీకు తెలుసా.. మూత్రం రంగుతో మనకు ఏవ్యాధులు సోకాయో తెలుసుకోవచ్చంట. కిడ్నీలో రాళ్లు, కిడ్నీలో కణితి, ప్రోస్టేట్, మూత్రాశయ వ్యాధులు వంటి జబ్బులు వస్తే కూడా మూత్రం రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.