Recipes: అదిరిపోయే బనానా బ్రెడ్.. బేకరీ టెస్ట్ ఇంట్లోనే!
Recipes: ఇప్పటి పిల్లలు స్నాక్స్ కి ఇచ్చే ప్రధాన్యత అంతా ఇంతా కాదు. పైగా రోజుకో రుచిని కోరుకుంటున్నారు. అందుకే పిల్లల కోసం చక్కనైన టేస్టీ అండ్ హెల్దీ బనానా బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం.

పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే మంచి ఆకలి మీద ఉంటారు. వస్తూనే చిరుజూళ్ళ మీద దాడి చేస్తారు అలా అని ప్రతిరోజు ఒకే వెరైటీ అంటే ఒప్పుకోరు రోజుకు ఒక కొత్త టేస్ట్ కావాలంటారు అలాంటి పిల్లల కోసమే ఈ బేకరీ స్టైల్ బనానా బ్రెడ్. దీనికి కావాల్సిన పదార్థాలు బాగా పండిన అరటి పండ్లు మూడు.
అరకప్పు వెన్న, పావుకప్పు పాలు, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, రెండు గుడ్లు, చిటికెడు ఉప్పు, మైదా రెండు కప్పులు, చక్కెర ఒక కప్పు. బ్రెడ్ నీ సిద్ధం చేయటానికి ముందు ఓవెన్ ని 175 డిగ్రీలు సెల్సియస్ కి ముందుగా వేడి చేయండి.
తర్వాత రొట్టె పాన్ తీసుకొని వెన్నతో గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అన్ని పదార్థాలని జోడించండి. మెత్తని అరటిపండ్లలో కరిగించిన వెన్నని వేసి బాగా కలపండి.
ఈ పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. పిండిని గ్రీస్ చేసిన బౌల్లో పోసి 175 డిగ్రీలు సెల్సియస్ వద్ద సుమారు 50 నిమిషాలు కాల్చండి. బయటికి తీసే ముందు ఒకసారి టూత్ పిక్ తో చెక్ చేయండి.
ఒకవేళ కొంచెం ముద్దుగా అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాలు పాటు ఓవెన్ లోనే ఉంచండి ఇప్పుడు చక్కనైన బనానా బ్రెడ్ రెడీ. మూడు నాలుగు రోజులపాటు నిల్వ ఉండే ఈ బ్రెడ్ ఫ్రిజ్లో పెడితే వారం వరకు నిల్వ ఉంటుంది. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం పరంగా కూడా పిల్లలకి చాలా మంచిది.