హెన్నాలో ఈ ఒక్కదాన్ని కలిపి పెడితే జుట్టు నల్లగా ఉంటుంది, చుండ్రు అస్సలు ఉండదు
చాలా మంది జుట్టుకు హెన్నాను పెడుతుంటారు. హెన్నా వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా కావడమే కాకుండా.. జుట్టు బలంగా అవుతుంది. వెంట్రుకలకు మంచి షైనింగ్ కూడా వస్తుంది.

హెన్నా
తెల్ల వెంట్రుకలు ఉన్నవారే జుట్టుకు మెహందీ పెడుతుంటారు. కానీ మెహందీని ఎవ్వరైనా జుట్టుకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మన జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిని జుట్టుకు పెట్టడం వల్ల తెల్ల వెంట్రుకలు కనిపించవు. అలాగే జుట్టు మూలాలు బలంగా అవుతాయి. వెంట్రుకలు ఊడిపోవడం తగ్గుతుంది. చుండ్రు లేకుండా పోవడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే చాలా మంది ఆడవారు జుట్టును అందంగా, నల్లగా చేయడానికి హెన్నాను పెడుతుంటారు. అయితే ఈ ఒక్క మెహందీనే కాకుండా.. దీనిలో పెరుగును కలిపి పెట్టడం వల్ల బోలెడు లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు.
హెన్నాలో పెరుగును కలిపి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
మెహందీలో పెరుగును కలిపి పెడితే అది జుట్టుకు మంచి కండీషన్ అవుతుంది. అలాగే చుండ్రును పోగొట్టడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. చుండ్రును తగ్గించుకోవాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా వాడండి. అలాగే హెన్నాలో పెరుగును కలిపి జుట్టుకు పెట్టడం వల్ల ఎన్నో హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ మిశ్రమాన్ని పెట్టడం వల్ల మీ జుట్టు సిల్కీగా అవుతుంది. బంగారు రంగులో కనిపిస్తుంది.
హెన్నా, పెరుగును ఎలా వాడాలి?
ఇందుకోసం కొంచెం హెన్నాను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేయండి. అలాగే కొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ను రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం జుట్టుకు బాగా పట్టించండి. దీన్ని మీరు 40 నుంచి 50 నిమిషాల వరకు జుట్టుకు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ ప్యాక్ మీ జుట్టును నల్లగా, అందంగా తయారుచేస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకునే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
తెల్లజుట్టుకు హెన్నా ప్యాక్
తెల్ల జుట్టును నల్లగా చేయడంలో హెన్నా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ లో టేబుల్ స్పూన్ బ్రహ్మీ పౌడర్ ను వేసి పేస్ట్ చేయండి. దీన్ని జుట్టుకు, నెత్తికి బాగా పట్టించి గంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది.