MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Maha Shivaratri: మహా శివరాత్రిని తెలుగు ప్రజలు జరుపుకునే తీరు..

Maha Shivaratri: మహా శివరాత్రిని తెలుగు ప్రజలు జరుపుకునే తీరు..

Maha Shivaratri: హిందువులు జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. ప్రతీ ఏటా ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. ఈ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఈ పండుగ రోజు శివుడి భక్తులు ఉపవాసాలు చేసి నిష్టగా పూజలు చేస్తూ తెల్లవార్లు శివ నామ స్మరణతో జాగారం చేస్తుంటారు. మరి ఈ పండుగ తెలుగు ప్రజలు ఏ విధంగా జరుపుకుంటారో తెలుసా..

2 Min read
Mahesh Rajamoni
Published : Feb 24 2022, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

Maha Shivaratri: తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి ఒకటి. ఈ పండుగ ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్థి నాడు జరుపుకుంటారు. అంతేకాదు ప్రతి నెలా చతుర్దశి మాస శివరాత్రి వస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో కూడా శివ భక్తులు నిష్టగా ఆ పరమేశ్వరుడికి నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. కానీ ఏడాదికి ఓసారి వచ్చే ఈ మహా శివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఎంతో విశిష్టమైనది.  

28

అందుకే మహా శివరాత్రి శివ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. అందులోనూ ఆ రోజు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందులోనూ అన్ని పండుగలను ఉదయం, సాయంత్రం వేళల్లో జరుపుకుంటే ఈ మహాశివరాత్రిని మాత్రం రాత్రి సమయంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో జ్యోతి స్వరూపడైన పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శణమిస్తాడు. 
 

38

అందుకే ఆ రోజున భక్తులంతా ఉదయాన్నే తల స్నానం చేసి, ఇళ్లను శుద్ది చేసుకుని ఉపవాసం ఉంటారు. ముఖ్యంగ ఆరోజంతా శివ నామ స్మరణ చేస్తూ దైవ చింతనలోనే ఉంటారు. ఇకరాత్రి సమయంలో ఆ దేవదేవుడి ఆనుగ్రహం కోసం జాగరణ (నిద్రపోకుండా) చేస్తూ శివుడికి పూజలు, అభిషేకాలు, భజనలు చేస్తూ పరమేశ్వరుడి సన్నిదిలోనే గడుపుతుంటారు. ముఖ్యంగా ఈ పండుగ హిందువులకు, శైవులకు పుణ్యప్రదమైనది. అందులోనూ ఈ పండుగ హిందువులు గొప్ప పర్వదినంగా జరుపుకుంటారు. 
 

48

ఈ మహా శివరాత్రి రోజున భక్తులు వీటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది 1. ఉపవాసం 2. జాగరణ 3. శివనామ స్మరణ, అభిషేకాలు. ఈ మహా శివరాత్రి నాడు భక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తారు. ఇంటిని శుద్ది చేసుకుని తలస్నానం చేస్తారు. అలాగే పూజా గదిని శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత గుమ్మాలకు మామిడి, వేప తోరణాలు కడతారు. పూజా గది గుమ్మం ముందు ముగ్గులు వేసి అలంకరిస్తారు. 
 

58

లింకారంలో ఉన్న పరమేశ్వరుడిని ఆవుపాలతో లేదా, పరిశుద్ధమైన నీళ్లు, లేదా పంచాపంచామృతంలో వివిధ జలాలను కలిపి శివుడికి ఇష్టమైన పువ్వులతో అభిషేకిస్తారు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్లపత్రాలు, మారేడు దళాలు, గోగుపూలు, తుమ్మిపూలు పచ్చవి, తెల్లటి వాటిని శివుడికి సమర్పిస్తూ పంచాక్షరీ మంత్రం ఓం నమశ్శివాయా.. అంటూ పరమేశ్వరుడిని పూజిస్తుంటారు.

68

ఖర్జూరపండు, అరటి పండు , తాంభూలం, చిలకడ దుంపలను శివుడికి సమర్పించాలి. పూజ చేస్తున్న సమయంలో ఖచ్చితంగా నిష్టగా పంచక్షరీ మంత్రం లేదా శివ అష్టోత్తర మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. కాగా శివుడికి ఉదయం 9 గంటలలోపూ పూజలు, అభిషేకాలు చేస్తేనే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. 

78

ఆరోజు మొత్తం శివ నామ స్మరణం జపించడం వల్ల భక్తులకు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే మహాశివరాత్రి నాడు అర్థరాత్రి 12 గంటలకు లింగోధ్వవ సమయం కాబట్టి అప్పుడు లింగరూపంలో ఉండే పరమేశ్వరుడిని పూజిస్తూ అభిషం చేస్తే పునర్జన్మ ఉందని ప్రజలు విశ్వసిస్తారు.  ఆ శివుడికి భక్తితో నీళ్లతో అభిషేకించినా ఆ స్వామి ఉప్పొంగిపోతాడట. 

88

మహాశివరాత్రి రోజున సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయ 6 గంటల వరకు నిష్టగా పరమేశ్వరుడిని పూజిస్తే విషేష ఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. జాగరణ చేసిన మరుసటి రోజు తలస్నానం చేసి దేవుడికి నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవుడికి సమర్పిస్తారు. ఉపవాసాన్ని వదిలిపేట్టేకంటే ముందుగా వీరు ఆవుకు తోటకూర, బియ్యం, బెల్లంలో కలిపి తినిపిస్తారు. అలాగే గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి.. పేదవారికి అన్న దానం చేస్తారు. ఆ తర్వాత  వీరు ఉపవాసాన్ని వదులుతారు. ఈ పద్దతిలో శివుడిని పూజిస్తే ఎన్నో గ్రహదోశలు పోయి, దైవానుగ్రహం పొందవచ్చని పురాణాలు పేర్కొంటున్నాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Cancer with Eggs: ఈ గుడ్లలో ప్రమాదకర రసాయనాలు.. తింటే క్యాన్సర్ వస్తుందా?
Recommended image3
Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved