Beauty Tips: కళ్ల కింద ముడతలు పోవాలంటే ఇలా చేయండి..
Beauty Tips: వయసు మీద పడుతున్నకొద్దీ ముఖం మీద, కళ్ల కింద ముడలు వస్తుంటాయి. ఇది సర్వ సాధారణం కూడా. అయితే కొందరికీ అకాల ముడతలు ఏర్పడుతుంటాయి. వీటిని వీలైనంత తొందరగా తొలగించుకోకుంటే మాత్రం మీ వయసు ఎక్కువగా కనిపించే ప్రమాదం ఉంది.

Beauty Tips: వయసు మీద పడుతున్నకొద్దే కళ్ల కింద, ముఖంపై ముడతలు వస్తుంటాయి. కానీ కొందరిని అకాల ముడతలు వేధిస్తుంటాయి. వీటిని మొదటిదశలోనే నివారించకపోతే ఈ ముడతలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో మీ అందం పూర్తిగా దెబ్బతింటుంది. అందులోనూ ఈ ముడతల వల్ల మీరు పెద్ద వయసువారిలా కనిపిస్తారు.
wrinkles
ఈ ముడతలను తగ్గించడానికి మార్కెట్లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నా .. అవి వాటి వల్ల ముడతలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముడతలతో పాటుగా కళ్ల కింద ఏర్పడ్డ నల్లని వలయాలను కూడా తొలగించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
tomato
టోమాటో.. టొమాటోలు మన ఆరోగ్యానికి కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఇవి ముడతలను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం టొమాటో గుజ్జును పేస్ట్ గా చేసి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను ముడతల ప్లేస్ లో అప్లై చేయాలి. అరగంటపాటు అలాగే ఉంచేసి.. ఆ తర్వాత ముఖాన్ని నీట్ గా కడగాలి. తరచుగా ఇలా చేస్తే కళ్లకింద ఉండే ముడతలు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి.
గ్రీన్ టీ.. గ్రీన్ టీ బ్యాగులతో ముడతలకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగులను కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి కళ్లపై పెట్టుకోండి. ఇలా వద్దనుకుంటే గ్రీన్ టీ తాగినా ముడతలు వదిలిపోతాయి.
అవకాడో.. అవకాడో గుజ్జును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కండ్ల చుట్టూ రాయాలి. అలాగే కొద్దిసేపు మర్దన కూడా చేయాలి. ఆ తర్వాత దీన్ని పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరచుగా ఇలా చేస్తే ముడతలు మటుమాయం అవుతాయి.
బాదం నూనె.. ముఖం లేదా కళ్ల కింద ముడతలను తొలగించేందుకు బాదం నూనె ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు ముఖాన్ని నీట్ గా కడగాలి. ఆ తర్వాత బాదం నూనెను ముఖానికి పెట్టి మెల్లిగా మర్దన చేయాలి. రాత్రంగా అలాగే ఉంచేసి.. ఉదయం ముఖం కడిగేస్తే సరి.. మార్పును మీరే గమనిస్తారు.
నీరు ఎక్కువగా తాగాలి.. నీళ్లు తక్కువగా తాగితే చర్మం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో ముఖం పేలవంగా తయారవడమే కాదు ముడతలు కూడా వస్తాయి. కాబట్టి ఈ వేసవిలో నీళ్లను పుష్కలంగా తాగుతూ ఉండాలి. అంటే రోజుకు సుమారుగా నాలుగు లీటర్లు తాగాలన్న మాట. అప్పుడే మీరు ఆరోగ్యంగా అందంగా ఉంటారు.