చుండ్రును పోగొట్టే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం..!
చుండ్రుతో ఎన్నో సమస్యలు వస్తాయి. జుట్టు రాలడం, నెత్తిమీద దురవ వంటి జుట్టు సమస్యలకు చుండ్రే అసలు కారణం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో చుండ్రును పూర్తిగా పోగొట్టొచ్చు. అదెలాగంటే
- FB
- TW
- Linkdin
Follow Us
)
dandruff
మనలో చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. చుండ్రును చిన్న సమస్యగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే చుండ్రు కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు రాలడం, దురద సమస్యలకు చుండ్రే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. చుండ్రు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే జుట్టు సంరక్షణపై కాస్త శ్రద్ధ పెడితే చుండ్రును నివారించొచ్చు. చుండ్రును పోగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె
టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె చుండ్రును వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం టీ ట్రీ ఆయిల్ ను, కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో తీసుకొని రెండింటిని మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. కొద్ది సేపు బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చుండ్రు పోతుందిి.
కలబంద జెల్
కలబంద జెల్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయెజనకరంగా ఉంటుంది. కలబంద జెల్ చుండ్రును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం కలబంద గుజ్జును తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును వదిలించడమే కాకుండా వెంట్రులను షైనీగా చేస్తుంది.
మెంతులు
చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడే వాటిలో మెంతులు కూడా ఉన్నాయి. ఇందుకోసం ముందుగా ఒక కప్పు మెంతులను రాత్రంతా నీట్లో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో గుడ్డు పచ్చసొన వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.
గుడ్డుపచ్చసొన
గుడ్డులోని పచ్చసొనను జుట్టుకు, నెత్తిమీద బాగా అప్లై చేయాలి. తర్వాత ప్లాస్టిక్ కవర్ లేదా మరేదైనా గుడ్డతో జుట్టును కవర్ చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. గుడ్డులోని పచ్చసొనలో ఉండే బయోటిన్ చుండ్రును పోగొడుతుంది.
ఉల్లిరసం, నిమ్మరసం
ఉల్లిపాయ రసం, నిమ్మరసం కూడా చుండ్రును దూరం చేస్తాయి. ఇందుకోసం ఉల్లిరసం, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని రెండింటిని మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇవి తలపై చుండ్రును, దురద సమస్యలను తొలగిస్తాయి.
వేప ఆకులు
కొన్ని వేప ఆకులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మాస్క్ ను తలకు అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును పోగొట్టు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.