Healthy Habits: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరు అలవాట్లు ఉండాల్సిందే..
Healthy Habits: మనం ఆరోగ్యంగా ఉండాలి.. అస్సలు హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరమే రాకూడదంటే మీ లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Healthy Habits: ఈ గజిబిజీ లైఫ్ లో మనుషుల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తిన్నామా అంటే తిన్నామనిపిస్తూ.. వర్క్ లో బిజీ బిజీ అవుతున్నారు. ముఖ్యంగా మంచి అలవాట్లకు చాలా దూరంగా ఉంటున్నారు. దీంతో వీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్న చిన్న మార్పులను చేస్తే మీరు హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరమే రాదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న మార్పులతో పాటుగా మితంగా ఆహారం తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. కంటి నిండా నిద్రపోతే మీకు ఎలాంటి జబ్బులు సోకే అవకాశమే ఉండదు.
రోజుకు 10 వేల అడుగులు నడవాలి.. ఆఫీసుల్లో లేదా వర్క్ ఫ్రం హోం లో గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం.. ఏదో ఒకసమయంలో తినడం.. ఇంటికి రావడం పడుకోవడం..ఉదయం లేవడం ఆఫీసుకు వెళ్లడం.. ఇలాంటి లైఫ్ స్టైల్ నే లీడ్ చేస్తున్నారు నేడు చాలా మంది. ఈ అలవాటు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి జబ్బులు మిమ్మల్ని చుట్టుకోకూడదంటే రోజుకు 10,000 అడుగులు అన్నా నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా కుదరదంటే వన్ అవర్ ఎక్సర్ సైజెస్ లు చేయండి. వీటివల్ల చెమట అధికంగా పట్టి.. ఒంట్లో అదనంగా పేరుకుపోయిన కొవ్వులు కరిగిపోతాయి.
పండ్లను తినండి.. వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది కూల్ డ్రింక్స్ ను లేదా పండ్ల రసాలను తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నిజానికి పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగడం కంటే పండ్లను అలాగే తినడం బెటర్. ఒకవేళ పండ్లను జ్యూస్ చేస్తే అందులో ఫైబర్ పోతుంది. ఇది తాగడం వల్ల మీ శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఖళీ కడుపున ఒక గ్లాస్ వేడినీళ్లను తాగండి.. విపరీతమైన ఎండలకు వేడి నీళ్లేంటి పిచ్చి కాకపోతే అనుకునే వారు చాలా మందే ఉంటారు. కానీ ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ వేడి నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు వేడి నీళ్లను తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. అంతేకాదు వీటివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది కూడా.
కంటినిండ నిద్ర అవసరం.. 24 గంటలు తిండి తిప్పలు లేకుండా ఫోన్లలో గడిపేవారు లేకపోలేదు. బాత్ రూం కి వెల్లినా వాటిని విడిచి పెట్టని వారు కూడా ఉన్నారు. చాలా మంది ఫోన్ లేకుండా దాన్నిచూడకుండా క్షణ కాలం కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా అర్థరాత్రి వరకు దాన్నే చూస్తూ.. దాన్ని పక్కలోనే పెట్టుకుని పడుకుంటున్నారు. ఫోన్ దగ్గరలో పెట్టుకుని పడుకోవడం వల్ల మనపై దాని రేడియేషన్ ప్రభావం పడుతుంది. దీంతో మీకు నిద్ర దూరమవుతుంది. కంటికి సరిపడా నిద్రలేకుండా మీరు యాక్టీవ్ గా ఉండలేరు. ఏ పనిచేద్దామన్నా ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాదు మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.
పంచదారకు బదులుగా బెల్లం తినండి.. ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. అయితే కాఫీ లేదా టీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని వేయండి. బెల్లం మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, జింక్, పొటాషియం, కాల్షియం, సోడియాన్ని అందిస్తుంది.
సమయానికి భోజనం అవసరం.. వేళా పాలా లేని తిండి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే సమయానుకూలంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా భోజనం మొత్తమే చేయపోవడం లేదా లేటుగా తినడం వంటి అలవాట్లను మానుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తిన్నప్పుడే ఒకేసారి హెవీగా తినకుండా తరచుగా కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు బరువు పెరిగే ఛాన్సెస్ ఉండదు.