Healthy Food: ఫాస్ట్ గా బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే వీటిని తినండి..
Healthy Food:బరువు ఎక్కువున్నా కష్టమే.. తక్కువున్నా కష్టమే.. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువుంటేనే అందం, ఆరోగ్యం. అయితే కొంతమంది బక్కాగా ఉన్నానే అని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ ఆహారాలను తింటే చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు.

కొంతమంది ఎక్కువ బరువుంటే.. మరికొంతమంది తక్కువ బరువుంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కావు. కానీ మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాదపడుతున్నారు. ఇంకొంత మందేమో మరీ బక్కగా పల్చగా ఉంటారు. ఇలాంటి వారు బరువు పెరగాలని ఏవేవో తింటుంటారు. అయితే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే మాత్రం మంచి డైట్ నే ఫాలో అవ్వాలి. ఏది పడితే అది తింటే మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. తక్కువ బరువున్న వారు ఎలాంటి హెల్తీ ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రోటీన్ సప్లిమెంట్స్ (Protein supplements)
ఆరోగ్యకరంగా, చాలా తొందరగా బరువు పెంచడానికి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం గుడ్లు (Eggs), పాలు, బఠాణీలు (peas), సోయా వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. వ్యాయామం చేసే ముందు లేదా ఇతర సమయాల్లో కూడా వీటిని తినొచ్చు. బరువు పెరగడానికి ప్రోటీన్ షేక్ ను తయారుచేసుకుని కూడా తాగొచ్చు. ప్రోటీన్ల కోసం బాదం వెన్న, వేరు శెనగ వెన్న, చియా విత్తనాలు, బంగాళాదుంపలు, అవిసె గింజలు, ఓట్ మీల్ వంటి ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. వీటిని తింటే వేగంగా బరువు పెరుగుతారు.
డ్రై ఫ్రూట్స్ (Dry fruits)
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. గుప్పెడు (సుమారు 1/4 కప్పు) ముడి బాదంప పప్పులో 15 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats), 6 గ్రాముల ప్రోటీన్ (Protein), 170 గ్రాముల కేలరీలు (Calories), 4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
పాలతో అరటిపండు
బరువును పెంచడంలో అరటి పండ్లు (Bananas)ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు ప్రతి రోజు గ్లాస్ పాలలో అరటిపండును కలిపి తీసుకోవాలి. దీనిలో కేలరీలు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని త్వరగా బరువు పెంచేందుకు సహాయపడుతుంది.
రెడ్ మీట్ (Red meat)
రెడ్ మీట్ లో ప్రోటీన్ కంటెంట్ (Protein content)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కండరాలను బలంగా చేస్తుంది. బరువును కూడా వేగంగా పెంచుతుంది. దీనిలో ప్రోటీన్లతో పాటుగా కొవ్వుకూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. తరచుగా తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అలా అని దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
పనీర్ (Paneer)
పనీర్ లో కొవ్వులు (Fats), కేలరీలు (Calories), ప్రోటీన్లు (Protein)ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీన్ని ఆహారంలో లేదా కూరగాయల్లో తీసుకుంటే వేగంగా బరువు పెరుగుతారు.
సాల్మాన్ (Salmon)
ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల (Omega 3 fatty acids)తో పాటుగా ప్రోటీన్ (Protein), ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats) పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పాలు (milk)
పాలు చాలా మంచివి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు (Minerals), కార్బోహైడ్రేట్లు, కాల్షియం (Calcium) వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది సంపూర్ణ ఆహారం కూడా. వీటిని తాగితే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
డార్క్ చాక్లెట్ (Dark chocolate)
ఈ చాక్లెట్స్ లో కోకో కంటెంట్ 70 శాతం ఉంటుంది. అంతేకాదు దీనిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని తినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మూడ్ స్వింగ్స్ సమస్య కూడా పోతుంది. అంతేకాదు ఈ డార్క్ చాక్లెట్ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది కూడా.