- Home
- Life
- మీ నాలుక రంగు ఒక్కటి చాలు.. మీకు ఎలాంటి రోగాలున్నాయో తెలుసుకోవడానికి..! ఎప్పుడైనా చెక్ చేశారా..?
మీ నాలుక రంగు ఒక్కటి చాలు.. మీకు ఎలాంటి రోగాలున్నాయో తెలుసుకోవడానికి..! ఎప్పుడైనా చెక్ చేశారా..?
నాలుక రంగును చూసే అలవాటు ఒక్క డాక్టర్ కే ఉంటుంది. ఎందుకంటే నాలుక రంగే మన ఆరోగ్యం ఎలా ఉందన్న సంగతి చెప్తుంది కాబట్టి. ఇంతకీ మీ నాలుక ఏ రంగులో ఉంటుందో ఎప్పుడైనా చూసుకున్నారా..

ప్రస్తుతం అంటువ్యాధులు దారుణంగా వ్యాపిస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ వ్యాధులు వ్యాపించడం మాత్రం ఆగడం లేదు. అందుకే మనం ఆరోగ్యంగా ఉండటానికి మన శరీర భాగాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏ అవయవంలో ఏ చిన్న మార్పు వచ్చినా.. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకూడదు. ముఖ్యంగా నాలుక రంగు విషయంలో. ఎందుకంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీ నాలుక రంగే చెప్తుంది కాబట్టి.
కావాలంటే మీకు జ్వరం లేదా కడుపునకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ నాలుక రంగును గమనించండి. అంతెందుకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే డాక్టర్ కూడా నాలుకనే చెక్ చేస్తాడు. ఎందుకంటే నాలుక రంగే మీకు ఎలాంటి రోగం వచ్చిందో చెప్తుంది. ఏ రంగే ఎలాంటి అనారోగ్య సమస్యకు కారణమో ఇప్పుడు తెలుసుకుందాం..
కొద్దిగా తెలుపు పూతతో.. మీ నాలుక సహజ రంగైన తెల్లగా ఉంటే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. మీ నాలుక ఇలా ఉంటే శరీరం సరైన స్థితిలోనే పనిచేస్తున్నట్టు.
పసుపు
మీ నాలుక పసుపు రంగులో ఉంటే మీరు కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. మీరు గ్యాస్ట్రాక్ లేదా జీర్ణ సంబంధ సమస్యలను ఫేస్ చేస్తున్నట్టైతే మీ నాలుక పసుపు రంగులోకి మారుతుంది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పసుపు రంగులో ఉండే నాలుక టైప్ 2 డయాబెటిస్ సంకేతమని పేర్కొంది. నోటిని సరిగ్గా శుభ్రం చేయకుంటే కూడా మీ నాలుక పసుపు రంగులో కనిపిస్తుంది. దీనివల్ల నాలుకపై ఎన్నో రకాల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుంది.
తెలుపు లేదా బూడిదరంగు
సాధారణంగా మన నాలుకకు తెలుపు పూత ఉంటుంది. అయితే నాలుకపై కొన్ని చోట్ల బూడిదరంగు ఉంటుంది. ఈ ప్లేసెస్ లో సాధారణం కంటే తెల్లగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. ఒకవేళ మీరు ల్యూకోప్లాకియాతో బాధపడుతున్నట్లయితే.. నాలుకపై తెల్లటి పాచెస్ ని కూడా మీరు గమనించొచ్చు. ఇది సాధారణంగా స్మోకింగ్ లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల వస్తుంది.
ఊదారంగు
మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గితే.. మీ నాలుక ఊదారంగులోకి మారుతుంది. అయితే ఈ రక్తప్రసరణ ఊపిరితిత్తులు లేదా హృదయనాళ సమస్యల వల్ల తగ్గుతుంది. అయితే చాలా కాలంగా గుండె సమస్యలతో బాధపడేవారి నాలుక ఇదే రంగులో ఉంటుంది.. ఎపుడైనా గమనించండి.
ఎరుపు
కొందరి నాలుకలు కాంతివంతంగా ఉండి ఉబ్బినట్టుగా ఉంటుంది. దీన్నే వైద్యులు "స్ట్రాబెర్రీ నాలుక" అని కూడా పిలుస్తారు. అయితే నాలుక ఉండటానికి కారణం ఆ వ్యాక్తికి గుండె సమస్యలు, రక్త రుగ్మతలు ఉండటమే. ఇది విటమిన్ బి లోపం లేదా స్కార్లెట్ జ్వరానికి కూడా సంకేతం కావచ్చు.