ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల పాదాల్లో వాపు వచ్చిందా.. ఇవిగో చిట్కాలు మీకోసమే..
ఎంత పని ఉన్నా.. పనిమధ్యలో నడవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది పనిలో పడి ఆ సంగతే మర్చిపోతుంటారు. దీనివల్ల పాదాలు వాపు వస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వీటిని తగ్గించుకోవచ్చు.

ఆఫీస్ లో పనిచేసే వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబాకయం, వెన్ను నొప్పి, మెడనొప్పితో పాటుగా కాళ్లు కూడా వాపు వస్తాయి. అయితే ఈ సమస్య ఇప్పటి మందానికి చిన్నదిగానే కనిపించినప్పటికీ.. ఇది ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల పాదాల్లో వాపును ఇట్టే తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాతి ఉప్పు
రాతి ఉప్పును కొన్ని ఏండ్ల నుంచి ఉపయోగించే వారు చాలా మందే ఉన్నారు. ఈ ఉప్పును ఉపయోగించి కూడా పాదాల వాపును తగ్గించుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా..? ఇందుకోసం చిన్న బకెట్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో రాతిఉప్పును కొద్దిగా వేయండి. ఈ నీటిలో మీ పాదాలను కొద్ది సేపు నానబెట్టండి. దీంతో పాదాల వాపు తొందరగా తగ్గిపోతుంది.
ఐస్ ప్యాక్
పాదాల వాపును తగ్గించడంలో ఐస్ ఫ్యాక్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఐస్ ప్యాక్ ను తీసుకుని వాపు ఉన్న ప్లేస్ లో కొద్దిసేపు మసాజ్ చేయండి. కాసేపటికే పాదాల వాపు తగ్గిపోతుంది. అలాగే మీరు కూడా రిలాక్డ్స్ గా ఫీలవుతారు.
ఫుట్ మసాజ్
ఫుట్ మసాజ్ కూడా పాదాల వాపు సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని గోరువెచ్చగా చేయండి. ఈ నూనెకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా జోడించొచ్చు. వెల్లుల్లితో తయారుచేసిన నూనె పాదాల వాపును చిటికెలో తగ్గిస్తుంది. ఇందుకో ఈ నూనెను తీసుకుని పాదాలకు 5 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయండి.
పసుపు
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది పాదాల వాపు సమస్య నుంచి బయటపడేందుకు కూడా సహాయపడుతుంది. దీనికోసం టీ స్పూన్ పసుపును తీసుకుని అందులో టీ స్పూన్ కొబ్బరి నూనె పోసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని పాదాల వాపుకు అప్లై చేయండి. ఈ మిశ్రమం పూర్తిగా ఎండిపోయిన తర్వాత.. గోరువెచ్చని నీటితో పాదాలను కడగండి.
బేకింగ్ సోడా
పాదాల వాపును పోగొట్టేందుకు బేకింగ్ సోడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని నీటిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ బియ్యం వేడి బాగా మరిగించి అందులో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను పాదాలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పాదాలకు రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. పాదాల్లో మంట కూడా తగ్గుతుంది.