కాలీఫ్లవర్ ను అతిగా తింటే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త...
కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదే అయినా... దీన్ని అతిగా తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి..
కాలీఫ్లవర్ ను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. దీనిని కూరల్లో, పకోడీలు వంటి రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. వీటిని వండటం చాలా సులువు. ఈ కూరగాయలో ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, విటమిన్ ఎ, పొటాషియం విటమిన్ బి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి.
కాలీఫ్లవర్ లో రాఫినోజ్ అనే ఒకరకమైన కార్భోహైడ్రేట్ ఉంటుంది. దీన్ని మన శరీరం అంత సులువుగా విచ్ఛిన్నం చేయలేదు. ఇది చిన్న పేగుల గుండా వెళ్లి పెద్దపేగులకు చేరుకుంటుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి కాలీఫ్లవర్ అంత మంచిది కాదు. ఎందుకంటే థైరాయిడ్ పేషెంట్లు వీటిని తింటే వారిలో టి -3, టి -4 హార్మోన్లు పెరుగుతాయి. అందుకే వీళ్లు దీన్ని అస్సలు తినకూడదు.
కాలీఫ్లవర్ లో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని రోజూ తింటే రక్తం చిక్కబడటం మొదలవుతుంది. అందుకే దీన్ని అతిగా తినకూడదు. అయితే గుండెపోటు సమస్య ఉన్న వారు రక్తం పలుచబడే ఆహారాలను తింటుంటారు. పొరపాటున కూడా వీరు కాలీఫ్లవర్ ను తినకూడదు.
cauliflower
కాలీఫ్లవర్ ను ఎక్కువగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కిడ్నీల్లో రాళ్లున్నవారు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి కూడా కాలీఫ్లవర్ మంచిది కాదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. ఈ కాలీఫ్లవర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ కూరగాయ ఎసిడిటీకి కూడా దారితీస్తుంది. దీనికి కారణం ఇందులో ఉండే పిండి పదార్థాలే.